Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
Hyderabad | గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్ల ట్యాంకర్లే దర్శన మిస్తున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, బస్తీలు, వాణిజ్య భవన సముదాయాలు.. ఎక్కడ చూసినా ట్యాంకర్లు వరుస కడుతున్నాయి.
Hyderabad | సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్ల ట్యాంకర్లే దర్శన మిస్తున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, బస్తీలు, వాణిజ్య భవన సముదాయాలు.. ఎక్కడ చూసినా ట్యాంకర్లు వరుస కడుతున్నాయి. భూగర్భ జలాలు వేగంగా పాతాళానికి చేరుకుంటుండటంతో మును పెన్నడూ బోర్లన్నీ ఎండిపోతున్నాయి. ప్రభుత్వం నూతనంగా బోర్లు వేయడానికి అనుమతులు ఎత్తేయడంతో మేడ్చల్, రంగారెడ్డి, హైదరా బాద్ జిల్లాల్లో నీటి కరువు ప్రారంభమైంది. బోర్లు వట్టిపోవడంతో కేవలం జలమండలి నీటిపైనే ఆధారపడాల్సి వస్తున్నది. మరోవైపు నల్లా నీటి సరఫరా అరకొరగా ఉండటం, లో ప్రెషర్ సమస్యలు వేధి స్తుండటంతో సిటీజనం నీటికోసం అవస్థలుపడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నా.. అవి కూడా మూడు నాలుగు రోజులైనా చేరకపోవడంతో నీటి ఇక్కట్లు తప్పడం లేదు.
జలమండలితో పాటు ప్రైవేట్ ట్యాంకర్లకు డిమాండ్ జఅమాంతం పెరుగుతున్నది. ఫిల్లింగ్ స్టేషన్లు అన్నీ కిటకిట లాడుతున్నాయి. రోజురోజుకు బుకింగ్స్ రెట్టింపు సంఖ్యలో నమో దవుతున్నాయి. ముఖ్యంగా దాని ప్రభావం వెస్ట్ సిటీతో పాటు విలీన మున్సిపాలిటీల్లో కనిపిస్తున్నది. ట్యాంకర్లకు ఏప్రిల్, మే నెల తరహాల్లో డిమాండ్ పెరుగుతున్నది. ఎండాకాలాన్ని తలపిం చేలా రికార్డుస్థాయిలో బుక్ అవుతున్నాయి. గడిచిన వారం రోజుల నుంచి బుకింగ్స్ 7 వేలు దాటుతున్నది. అక్టోబర్ నెలలో ఇంత మొత్తంలో ట్యాంకర్లు బుక్ అవడం ఇదే తొలిసారి అని జల మండలి అధికారులు చెప్తున్నారు.
ముఖ్యంగా జలమండలి పరిధి పెరిగినా ట్యాంకర్ల సంఖ్య పెరగపోవడంతో బుక్ చేసిన రెండు మూడు రోజులు దాటిన తర్వాత ఇండ్లకు చేరుతున్నాయి. మరో వైపు ట్యాంకర్ యజమానులు దందాకు తెరతీస్తున్నారు. డిమాండ్ అమాంత పెరుగుతుండటంతో బుక్ చేసుకుని టోకెన్ నెంబర్ వచ్చాక వినియోగదారులకు కేవలం చిన్న మిస్డ్ కాల్ చేస్తు న్నారు. వినియోగదారుడు స్పందించడం లేదని… బ్లాక్‌లో అమ్ము కుంటున్నారు. ఒక్కో ట్యాంకర్‌ను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు విక్రయిస్తున్నారు. ఈ దందా ఎక్కువగా వెస్ట్ సిటీలో జరుగుతున్నది. ట్యాంకర్ బుక్ చేసినా మూడు నాలుగు రోజులకు కూడా రాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఇదే అదనుగా ప్రైవేట్ ట్యాంకర్ల యజమా నులు అందినకాడికి దండుకుంటున్నారు.
సరఫరాలో కోతలు
ఎల్‌నినో ప్రభావంతో బోర్లన్నీ వట్టిపోతు న్నాయి. దీనికి తోడు మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్లు జలమండలి సర ఫరాలో కోతలు విధిస్తున్నారు. వందలాది బస్తీలు, కాలనీల్లో లోప్రెషర్ సమస్య వేధిస్తున్నదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లలో బోర్లు పోయకపోవడం, జలమండలి నీళ్లు లోప్రెషర్‌తో వస్తుండ టంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. నీళ్లు సరిపోక పోవడం వల్ల ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో డిమాండ్ అమాంతం పెరుగుతున్నది. కొన్ని ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, ధనవంతుల ఇండ్లకు ఎక్కువ సమయం నీటిని వదులుతున్నారని, దీంతో బస్తీలకు నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డబ్బులు వెచ్చించి ట్యాంకర్లు కొను గోలు చేయగలిగే స్థోమత ఉన్నవాళ్లకు గంటల తరబడి నీటిని సరఫరా చేస్తూ.. నిరుపేదలు, మధ్య తరగతి కుటుంబాలు నివసించే బస్తీలు, కాలనీలకు మాత్రం పది నిమిషాలకు మించి నీటిని వదలడం లేదని వాపోతున్నారు. జలమం డలి ట్యాంకర్లను బుక్ చేస్తే మూడు రోజులు దాటినా రావడం లేదని ఆవేదన చెందుతు న్నారు. రోజుకు 7 వేల బుకింగ్స్ అవుతున్నప్పుడే డెలివరీ ఆలస్యమవుతుంటే.. ముందు ముందు పరిస్థితి తీవ్రం కానున్నది. ఈనేప థ్యంలో జలమండలి అధికారులు నీటి సరఫ రాలో హెచ్చుతగ్గులను నియంత్రిస్తూ ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని కోరుతు న్నారు. అదేవిధంగా ట్యాంకర్లను పక్కదారి పట్ట కుండా నియంత్రించాలని వేడుకుంటున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

