రిజిస్టర్డ్ సిమ్ ఉంటేనే ఇక వాట్సాప్!
మొబైల్ సిమ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న కొత్త నిబంధనలు త్వరలో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్రముఖ మెసేజింగ్ సేవల వినియోగదారులపై ప్రభావం చూపనున్నాయి. నిబంధనల పరిధిలోకి వచ్చే యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు తమ ఖాతాలను కేవైసీ ధృవీకరించిన సిమ్ కార్డులతో అనుసంధానించాలని టెలికమ్యూనికేషన్స్ శాఖ(డీవోటీ) ఆదేశించింది. ఈ నిబంధనలను పాటించడానికి ఈ ఏడాది డిసెంబర్ 31ను గడువు తేదీగా నిర్ణయించింది.
- జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: మొబైల్ సిమ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న కొత్త నిబంధనలు త్వరలో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్రముఖ మెసేజింగ్ సేవల వినియోగదారులపై ప్రభావం చూపనున్నాయి. నిబంధనల పరిధిలోకి వచ్చే యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు తమ ఖాతాలను కేవైసీ ధృవీకరించిన సిమ్ కార్డులతో అనుసంధానించాలని టెలికమ్యూనికేషన్స్ శాఖ(డీవోటీ) ఆదేశించింది. ఈ నిబంధనలను పాటించడానికి ఈ ఏడాది డిసెంబర్ 31ను గడువు తేదీగా నిర్ణయించింది.
రిజిస్టర్డ్ సిమ్ కార్డ్ లేకుండా వైఫై ద్వారా వాట్సాప్ లేదా టెలిగ్రామ్‌ను ఉపయోగించే స్మార్ట్ఫోన్లపై ఈ కొత్త నిబంధనలు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇందులో ఐఫోన్లు, ఆండ్రాయిడ్ పరికరాలు రెండూ ఉంటాయి. ఈ సేవలు నిబంధనలను ఎలా అమలు చేస్తాయనే దానిపై ఆధారపడి ఉంటాయి. ఐఫోన్లో సిమ్ కార్డ్‌లేని విషయాన్ని గుర్తించిన యాపిల్ సిమ్ బైండింగ్‌కు మద్దతు ఇచ్చేలా ఇప్పటికే సెప్టెంబర్‌లో విడుదల చేసిన సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఐవోఎస్‌ను అప్డేట్ చేసింది. తమ మెసేజింగ్ ఖాతాలను బహుళ పరికరాలలో ఉపయోగించేవారు ఈ కొత్త నిబంధనలు వారి సెటప్‌ను ఎలా ప్రభావితం చేస్తాయో తనిఖీ చేసుకోవలసి ఉంటుంది. జనవరి 1, 2027 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలవుతాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- registered SIM
- sim
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

