డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
ఆధార్ ధృవీకరణ ద్వారా పూర్తిచేసే కొన్ని ఆన్లైన్ డ్రైవింగ్ లైసెన్స్ సేవలకు ఫీజు మినహాయింపుతో పాటు సురక్షిత డ్రైవింగ్ శిక్షణ మదింపు కోసం అర్హత పరిమితిని(పాస్ మార్కులు) 60 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. ప్రతిపాదిత మార్పుల లక్ష్యం డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలకు మదింపు అర్హతలను కఠినతరం చేయడమేనని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
- కొన్ని ఆన్లైన్ లైసెన్స్ సేవలకు ఫీజు మాఫీ
- నిబంధనల్లో మార్పులకు కేంద్రం ప్రతిపాదన
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఆధార్ ధృవీకరణ ద్వారా పూర్తిచేసే కొన్ని ఆన్లైన్ డ్రైవింగ్ లైసెన్స్ సేవలకు ఫీజు మినహాయింపుతో పాటు సురక్షిత డ్రైవింగ్ శిక్షణ మదింపు కోసం అర్హత పరిమితిని(పాస్ మార్కులు) 60 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. ప్రతిపాదిత మార్పుల లక్ష్యం డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలకు మదింపు అర్హతలను కఠినతరం చేయడమేనని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
సురక్షిత డ్రైవింగ్‌కు సంబంధించిన శిక్షణ కనీసం 30 నిమిషాలపాటు ఉండాలని కేంద్ర మోటర్ వాహనాల నిబంధనలకు ప్రతిపాదించిన సవరణల ముసాయిదాలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ ప్రతిపాదన ప్రకారం లైసెన్సింగ్ అధికారులు పేరు, చిరునామాతో సహా డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను మార్చడానికి చేసే దరఖాస్తులను తిరస్కరణకు గల కారణాలు సహా తెలియచేస్తూ 15 రోజుల్లోపు ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. అలాగే దరఖాస్తుదారుని పేరు, చిరునామా సహా వ్యక్తిగత వివరాల్లో మార్పులు చేసేందుకు విధించే రుసుములను తొలగించాలని కూడా ముసాయిదాలో ప్రతిపాదించారు. దరఖాస్తుదారులు తమ గుర్తింపు, వయస్సు, నివాస ధృవీకరణ కోసం ఉపయోగించే పత్రాలను కూడా ముసాయిదా నిబంధనలు నిర్దేశిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

