బన్సీలాల్‌పేట్, ఫిబ్రవరి 20 : రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లపై ఉండే నిరాశ్రయులకు, అనాథలకు పద్మారావునగర్‌కు చెందిన స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం దుస్తులను పంపిణీ చేశారు. స్కై ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ సంజీవ్ కుమార్, ఉపాధ్యక్షురాలు పావని, వలంటీర్లు చందన, ప్రవళిక, సూర్యకిరణ్ తదితరులు వ్యా నులో తిరుగుతూ నిరాశ్రయులను పలకరించి, వారికి దుస్తులు, బిస్కెట్లు, తాగునీరు ప్యాకెట్లను అందించినట్లు తెలిపారు. అనాథలను ప్రభుత్వం ఆదుకోవాలని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని వారు కోరారు. కొంతకాలంగా సేవా కా ర్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.