అబిడ్స్, ఫిబ్రవరి 6 : కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరింత వేగం పెంచారు. 15 ఏండ్ల నుంచి మొదలుకుని అన్ని వయస్కుల వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. 60 ఏండ్లు పైబడిన వారికి, ఫ్రంట్ వారియర్స్‌కు బూస్టర్ డోస్ వేయడంతో పాటు ఇంటింటా జ్వర సర్వే నిర్వహిస్తున్నారు. వైద్య శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుని కరోనా కట్టడి చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని యూపీహెచ్సీ కేంద్రాలతో పాటు బస్తీ దవాఖానల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆయా యూపీహెచ్సీ కేంద్రాలలో వ్యాక్సినేషన్ జరుగుతున్న పని తీరును డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓలు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారి వివరాలను నమోదు చేసుకుని వ్యాక్సిన్ వేస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా, ఆ లైన్లో నమోదు చేసి వ్యాక్సిన్ వేస్తున్నారు. వ్యాక్సిన్ విషయమై ప్రజలలో అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని పన్నిపురా క్లస్టర్ డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ మల్లీశ్వరి, కింగ్‌కోఠి క్లస్టర్ డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ పద్మజ పరిధిలోని యూపీహెచ్‌సీలు మహారాజ్‌గంజ్, బేగంబజార్, ఇసామియాబజార్, ఆర్ఎఫ్పీటీసీ, ఆగాపురా, డీబీఆర్ మిల్, గగన్‌మహల్, బొగ్గులకుంట, సుల్తాన్‌బజార్, కోఠి ఈఎన్టీ, కింగ్‌కోఠి దవాఖానలతో పాటు పన్నిపురా, పురానాపూల్-1, పురానాపూల్ – 2, కార్వాన్, దూద్‌బౌలి, కిషన్‌బాగ్, యూపీహెచ్‌సీలలో సిబ్బంది అందుబాటులో ఉండి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు బస్తీలలో జ్వర సర్వే చేపడుతున్నారు.