Jaya Tulsi | గృహోపకరణాలకు ఎక్కువగా టేకు కలపనే ఉపయోగిస్తారు. కారణం అవి ఎండకు, వానకు ఓపట్టాన పాడుకావు. నాణ్యంగానూ ఉంటాయి. కొందరు అవగాహన రాహిత్యంతో ఆ కలపను తిరిగి ఉపయోగించకుండా వృథా చేస్తుంటారు. కానీ, హైదరాబాద్‌కు చెందిన జయ తులసి మాత్రం ఆ పాత చెక్కలకు కొత్తరూపం ఇస్తున్నది. మూలన పడేసిన పాత ఫర్నిచర్‌ను అందంగా మలిచి తిరిగి విక్రయిస్తున్నది.
ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అయిన జయ తులసికి కరోనా కాలంలో పనిలేకుండా పోయింది. దీంతో వారసత్వంగా వచ్చిన కలప వ్యాపారాన్నే సరికొత్తగా చేయాలనుకున్నది. తనకు వడ్రంగి పని కూడా తెలియడంతో.. ‘బ్రౌండ్ అండ్ టీల్ ( Brown & Teal )’ పేరుతో ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకొంది. ఇన్‌స్టా, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా తన వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నది. పర్యావరణానికి తాను ఎంతో మేలు చేస్తున్నానని సగర్వంగా చెబుతున్నది జయ తులసి.
అప్పుడు చెత్తతో ఏం పని అన్నరు.. కానీ ఇప్పుడు 14 రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తోంది”