హుజూరాబాద్ రూరల్, జూలై 29ర్లు ఆన్‌చేసి సాగుకు నీరిచ్చి రైతులను ఆదుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్ రూరల్ మండలం సిర్సపల్లిలో సాగునీరు లేక బీడుపడిన వ్యవసాయ భూములను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ నుంచి వెళ్లి సముద్రంలో కలిసిన ప్రతి నీటి చుక హుజూరాబాద్ రైతు కళ్లలో కన్నీటి చుకగా మారిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి ఉంటే.. ఆ నీరు అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, నందిమేడారం, మిడ్‌మానేరు మీదుగా ఎల్‌ఎండీకీ అలాగే మల్లన్నసాగర్‌కు చేరేదన్నారు. కానీ, వందలాది టీఎంసీల నీరు సముద్రంలో కలువడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని వాపోయారు.
హుజూరాబాద్ నియోజవర్గంలో వరి సాగు ఎకువగా ఉంటుందని, కానీ, నీటి కొరత కారణంగా పొలాలు బీళ్లుగా మారాయని, రైతులు నాట్లు కూడా వేయలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి నీటి కోసం వ్యవసాయ బావుల్లో పూడిక తీయని పరిస్థితి ఉందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం బావులకు క్రేన్వాడే దుస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి కన్నెపల్లి మోటర్లను ప్రారంభించి నీరివ్వాలని డిమాండ్ చేశారు.