జమ్మికుంట రూరల్ : ఈటల రాజేందర్ టీఆర్ఎస్లోకి రాకముందే హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగిరిందని, హుజూరాబాద్ గడ్డ..గులాబీ జెండా అడ్డా అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మండల పరిధిలోని బిజిగిరిషరీప్ గ్రామంలో బుధవారం ధూం ధాం కార్యక్రమాన్ని వర్దన్నపేట్ ఎమ్మెల్యే మండల ఇంచార్జీ ఆరూరి రమేశ్ ఆధ్వర్యంతో నిర్వహించారు.
ధూం ధాం కార్యక్రమానికి ముఖ్య అతిధితులుగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు, హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, కిషోర్‌లు హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన ఆర్ధిక మంత్రికి డప్పు చప్పుళ్లు మహిళలు కోలాటాల మధ్య ఘన స్వాగతం పలికారు. కళాకారులు తెలంగాణ ఆట పాటలతో ప్రజలను ఉర్రూతలూగించారు.
ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…..కారుగుర్తుకు ఓటేసి ధరలు పెంచుతున్న బీజేపీ పార్టీకి బొందపెట్టాలన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఫించన్ కేవలం 600 రూ. ఇస్తున్నారని వివరించారు. మనం రెండువేల పదహారు ఇస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెర్ట్ కట్టి వ్యవసాయాన్ని పండుగు చేసింది సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉజ్వల పధకం కింద గ్యాస్ సిలండర్ ఇస్తే ధరలు పెరిగి సిలిండర్లు అట కెక్కయన్నారు.
కేసీఆర్ కిట్‌తో ప్రవేటు అసుపత్రుల గిరాకీ తగ్గి, ప్రభుత్వ దవాఖానాలో ప్రసవాలు జరుగుతున్నాయని పెర్కొన్నారు. అక్కచెల్లెండ్లకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి చేతనైన పని చేస్తున్నమన్నారు. ఈటల రాజేందర్ స్వౌర్ధం కోసం బిజెపి పార్టీలో చేరారన్నారు. బిజెపిలో చేరిన ఈటల ఏం చేస్తాడని ప్రశ్నించారు. ఈటలతో వచ్చేది, పోయేది లేదన్నారు. గెల్లు సీను గెలుపు సీను అయ్యాడన్నారు.
ప్రజల సంక్షేమం కొసం రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఉచిత హస్టల్ విద్య, కేసీఆర్‌కిట్ వంటి అనేక సంక్షేమ పధకాలను అందిస్తున్న సీఎంకు అండగా నిలువాలన్నారు. 30వ తారీకున ప్రజలు కారుగుర్తుకు ఓటేసి బీజేపీని బొందపెట్టడం ఖాయమన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు సదయ్య, స్వాతి,సుజాత,శ్రీరాం శ్యాం, సీనియర్ నాయకుడు ముద్దసాని కశ్యప్‌రెడ్డి, ఎంపీటీసీ రాజయ్య, వరంగల్ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవిందర్‌రావు, నాయకులు వాసుదేవరెడ్డి, యుగేందర్‌రెడ్డి,దేవేందర్‌రావు, భరత్‌కుమార్, లత, సమీర్, దామోదర్లతోపాటు తదిరులు పాల్గొన్నారు.