తుంగతుర్తి, జూలై 09 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో గురువారం విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళ కోట కనకలక్ష్మీ (60) ని ఆమె భర్త సత్యనారాయణ దారుణంగా హత్య చేసి చంపాడు. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తలు అల్లం, వెల్లిపాయ, పసుపు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారని, వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వీరి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం ఇరువురి మృతదేహాలను తుంగతుర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. హత్య, ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.