FIFA : ఫిఫా వరల్డ్‌కప్‌లో మ్యాచ్ రిఫరీల నిబద్ధతపై, పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈజిప్ట్, అర్జెంటీనా 16వ రౌండ్ మ్యాచ్ అనంతరం రిఫరీ ఫ్రాంకోయిస్ లెటెగ్జియర్(François Letexier) తప్పుడు నిర్ణయాలను ఎత్తి చూపుతూ ఈజిప్ట్‌ను దోచుకున్నారని, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని పలువురు కామెంట్లు చేశారు. మెస్సీ కోసం మాకు అన్యాయం చేశారని ఆఫ్రికా జట్టు ఆరోపణలు చేసింది. ఈ వివాదంపై ఫిఫా రిఫరీల అధికారి పియెర్లీగి కొల్లిన(Pierluigi Collina) స్పందిస్తూ.. అవన్నీ కట్టుకథలని కొట్టిపారేశాడు. తాము ఎవరికీ లొంగిపోమని, ఎవరూ తమను ప్రభావితం చేయలేరని కొల్లిన స్పష్టం చేశాడు.
ఈజిప్ట్, అర్జెంటీనా 16వ రౌండ్ మ్యాచ్‌లో రిఫరీ లియోనల్ మెస్సీ బృందానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. తాము రెండో గోల్ చేసి ఆధిక్యంలో నిలిచినా.. వీఈఆర్ అనంతరం తమమ మిడ్‌ఫీల్డర్ మర్వాన్ అట్టియా పొరపాటు చేశాడని రిఫరీ గోల్ ఇవ్వలేదని ఈజిప్ట్ మండిపడింది. రిఫరీపై వచ్చిన ఆరోపణలపై ఫిఫా రిఫరీల అధికారి పియెర్లీగి కొల్లిన వివరణ ఇచ్చాడు.
🚨 BREAKING:
The Egyptian Football Association has filed an official complaint with FIFA against French referee François Letexier, who officiated the match against Argentina.
How do you think the referee managed the match? pic.twitter.com/9Q2sDpjac1
— GBC (@GBC_Press) July 8, 2026
‘తక్కువ సమయంలో ఇన్ని మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు పొరపాట్లు జరగడం సహజం. అలాంటప్పుడు తర్వాతి మ్యాచ్‌లో ఏ తప్పు జరగకుండా చూసుకుంటారు రిఫరీలు. నిర్ణయాత్మక చర్చలు అనేవి ఫుట్‌బాల్‌లో భాగమే. అదే సమయంలో అసంబద్ధమైన ఆరోపణలకు చోటులేదు. ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్ అధికారుల చిత్తశుద్దిని ఎవరూ శంకించలేరు. మేము ఎవరి ప్రలోభాలకు లొంగం. ఫిఫా అధ్యక్షుడు కూడా మమ్మల్ని ప్రభావితం చేయలేరు. కోచ్‌లు, ఆటగాళ్ల మాదిరిగానే రిఫరీలు కూడా నిజాయతీగా ఉంటారు. తమ బెస్ట్ ఇవ్వాలని అనుకుంటారు.
🚨🎙️ Pierluigi Collina (FIFA Head of Referees):
• “Egypt’s Marwan Attia clearly stepped on the foot of Argentina’s Lisandro Martínez before the goal. The referee was correct to disallow it.” ✅
• “The challenge between Mohamed Salah and Julián Álvarez was normal contact… pic.twitter.com/R2pbM53DfM
— MC (@CrewsMat10) July 9, 2026
ఇక ప్రతి గోల్ తర్వాత వీఏఆర్‌లో అటాకింగ్ ప్రక్రియను గమనిస్తాం. ఒకవేళ తప్పిదం(ఫౌల్) జరిగినట్టు అనిపిస్తే.. మైదానంలోని రిఫరీకి సమాచారమిస్తాం. అందుకు.. నిర్ణీత సమయం అంటూ ఏమీ ఉండదు. ఈజిప్ట్, అర్జెంటీనా మ్యాచ్‌లో.. ఈజిప్ట్ మిడ్ ఫీల్డర్ మర్వాన్ అట్టియా గోల్ కొట్టడానికి ముందు ప్రత్యర్థి పాదంపై కాలు మోపాడు. రిఫరీ అది గమనించకున్నా.. వీఏఆర్‌లో స్పష్టంగా కనిపిచింది. దాంతో, గోల్ ఇవ్వలేదు’ అని ఫిఫా రిఫరీల హెడ్ వెల్లడించాడు.
ఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) జోక్యం చేసుకోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. అమెరికా ఫార్వర్డ్ ఫొలారిన్ బలోగన్(Folarin Balogun)కు ఇచ్చిన రెడ్ కార్డ్‌ను వెనక్కి తీసుకునేలా ట్రంప్ ఒత్తిడి చేశారని.. వెంటనే అతడిపై నిషేధం ఎత్తివేశారని పలువురు ఫిఫాపై మండిపడ్డారు.