అర్వపల్లి, జూలై 09 : సూర్యాపేట జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, రెండో యాదాద్రిగా పేరుగాంచిన అర్వపల్లి శ్రీ యోగానoద లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో కృష్ణ శిలలతో నిర్మిస్తున్న మహారాజ గోపురం దర్వాజ ప్రతిష్ఠాపణ కార్యక్రమం దేవాలయంలో గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తన తల్లి సావిత్రమ్మ జ్ఞాపకార్థం కోటి యాబై లక్షల రూపాయలతో నిర్మిస్తున్న దర్వాజ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో జగదీశ్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిoచారు. మహారాజ గోపురం పనులు కూడా పూర్తి కావొస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్.ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత, నాగారం సర్పంచ్ రామచంద్రారెడ్డి, సురేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, కట్ట రేణుక, వేమన్ రెడ్డి, దేవాలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి, సర్పంచ్ చిలంచర్ల విద్యాసాగర్, దేవాలయ ఈఓ శ్రీనివాస్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసమూర్తి, దేవాలయ అర్చకులు రాంబాబు, పవన్, భక్తులు పాల్గొన్నారు.