అచ్చంపేట రూరల్ : కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడులను ( Labor codes ) రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం అచ్చంపేట నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సమ్మెను నిర్వహించారు. అనంతరం ఆర్డీవో మాధవికి ( RDO Madhavi ) వినతి పత్రం అందజేశారు.
అంతకు ముందు అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లేష్ , సీపీఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి పెరుమల గోపాల్ , ఐఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు మహబూబ్ అలీ , తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జర్పుల శివ ప్రచండ , ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రేమ్ కుమార్ , ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు నరసింహ, మహిళా సంఘం నియోజకవర్గ నాయకులు శివలీల , స్వాతి , 327 విద్యుత్ కార్మిక సంఘం నాయకులు నిరంజన్ పాల్గొని మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందిందని, కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా రూపొందించడం వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అచ్చంపేట ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సమ్మెలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి శంకర్ నాయక్ , రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేశా నాయక్ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కార్యదర్శి బి రాములు, అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకురాలు పార్వతమ్మ, భారతి, మంజుల, ఆశా వర్కర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రజిత, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష ,కార్యదర్శులు బాలస్వామి, వేమన, ఆశ్రమ పాఠశాల వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు భరత్ సురేందర్ , మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ నాయకులు బాలమ్మమధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు.