Indiramma Illu | నిజాంపేట, ఆగస్టు 13 : ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ఎలా చేయాలో నిరుపేదలకు అవగాహన కల్పించేందుకు సంగారెడ్డి జిల్లా నిజాంపేట ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో నమూనా నిర్మాణం చేపట్టారు. ఈ మోడల్ ఇందిరమ్మ ఇంటి పనులను హౌసింగ్ పీడీ చలపతి పరిశీలించారు.
ఈ సందర్భంగా హౌసింగ్ పీడీ చలపతి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం నాణ్యమైన వస్తువులనే వాడాలని సూచించారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణం పనులు పూర్తిచేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు మండల పరిధిలో ఎన్ని నిర్మాణాలు చేపట్టారు.. వాటిలో మొదటి విడత బిల్లులు తీసుకున్న వారెందరు? రెండో విడత ఇంటి నిర్మాణం పూర్తయిన వారి వివరాలను తెలియజేయాలని ఎంపీడీవో సంగ్రామ్, గ్రామ పంచాయితీ సెక్రటరీ లక్ష్మణ్‌కు సూచించారు.