Telangana | సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడని లైన్మెన్పై ఓ ఇంటి యజమాని పెట్రోల్ పోసి చంపేందుకు యత్నించాడు.
వివరాల్లోకి వెళ్తే.. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌కు చెందిన ఓ ఇంటి యజమాని కరుణాకర్ బిల్లు కట్టలేదు. ఈ క్రమంలో లైన్మెన్ నరేశ్ అతని ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన కరుణాకర్.. లైన్మెన్ నరేశ్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆ వెంటనే అతనిపై పెట్రోల్ పోసి, నిప్పంటించే ప్రయత్నం చేశాడు. కరుణాకర్ భార్య అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. నరేశ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.