బాసెల్: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో నిరాశపర్చిన భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ మరో కీలక టోర్నీకి సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి మొదలుకానున్న బీడబ్ల్యూఎఫ్ స్విస్ ఓపెన్ సూపర్-300లో బరిలోకి దిగుతున్నారు. తాజాగా ముగిసిన ఆల్‌ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో తీవ్రంగా నిరాశపరిచిన సింధు, శ్రీకాంత్ ఎలాగైనా పుంజుకోవాలని చూస్తున్నారు. సింగిల్స్ తొలిరౌండ్లో స్విట్జర్లాండ్‌కు చెందిన లీన్హోమార్క్తో సింధు తలపడనుంది. మరోవైపు వాంగ్జీతో సైనా నెహ్వాల్ తన పోరును మొదలుపెట్టనుండగా, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, సాయిప్రణీత్, కశ్యప్, ప్రణయ్, సమీర్‌వర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరికి తోడు డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్, త్రిసాజాలీ జోడీ, సిక్కిరెడ్డి, అశ్విని పొనప్ప ద్వయం, విష్ణువర్ధన్‌గౌడ్, ప్రసాద్ జంట బరిలోకి దిగనున్నారు.
వరుస టోర్నీల్లో దూకుడైన ఆటతో అదరగొడుతున్న యువ షట్లర్ లక్ష్యసేన్ స్విస్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. గత కొన్ని నెలలుగా విరామం లేకుండా టోర్నీలు ఆడుతున్న ఈ యువ షట్లర్ విశ్రాంతి తీసుకున్నాడు. వరుస టోర్నీలతో అలసటకు గురికావడంతో స్విస్ ఓపెన్ నుంచి సేన్ తప్పుకున్నట్లు అతడి మెంటార్ విమల్‌కుమార్ తెలిపాడు. ప్రస్తుత సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తూ రానున్న ప్రతిష్ఠాత్మక ఆసియా, కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటాలని లక్ష్య భావిస్తున్నట్లు వివరించాడు.