కొత్త సర్కిళ్లను విలీనం చేయని జలమండలి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా ఏర్పడిన ఘట్కేసర్, బోడుప్పల్, కీసర, మేడ్చల్ సర్కిళ్లలో నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఇటీవలే జీవో జారీ చేసింది.
మేడ్చల్, అక్టోబర్17(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా ఏర్పడిన ఘట్కేసర్, బోడుప్పల్, కీసర, మేడ్చల్ సర్కిళ్లలో నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఇటీవలే జీవో జారీ చేసింది. అయితే జలమండలిలో విలీనం చేసుకోవాలంటే ప్రభుత్వం ఎలాంటి బడ్డెట్ కేటాయించకపోడంతో జలమండలిలో నూతన సర్కిళ్లను విలీనం చేసుకునేందుకు జలమండలి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం జీవో ఇచ్చినందున నీటి సరఫరాను జలమండలి అధికారులు చేయాలని సర్కిళ్ల అధికారులు జలమండలి అధికారులను కోరుతున్న బడ్జెట్ లేకుండా ఎలా విలీనం చేసుకుంటామని అంటున్నట్లు తెలుస్తోంది. గతంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న 16 మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన విషయం తెలిసిందే.
తర్వాత జీహెచ్ఎంసీని మూడు ముక్కలుగా విభజించిన అనంతరం మల్కాజిగిరి కార్పొరేషన్(ఎంఎంసీ)లో మూడు సర్కిళ్లగా ఏర్పాటు చేయగా సీఎంసీలో కొంపల్లి, దుండిగల్, చింతల్, జిడిమెట్ల, నిజాంపేట్, మేడ్చల్లను విలీనం చేసింది. సీఎంసీలో విలీనం చేసిన సర్కిళ్లలో మేడ్చల్ సర్కిల్ మినహా అన్ని సర్కిళ్లలో జలమండలి ద్వారానే నీటి సరఫరా జరుగుతుండగా ఎంఎంసీలో విలీనం చేసిన ఘట్కేసర్, బోడుప్పల్, కీసర సర్కిళ్లలో మాత్రం ప్రభుత్వం జీవో ఇచ్చిన విలీనం చేసుకోవడంలో జలమండలి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.
ప్రజలకు భారంగా నీటి కొనుగోలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా నీటి ఎద్దడి తీవ్రమవుతున్న క్రమంలో నీటి కొనుగోలు ప్రజలకు భారంగా మారింది. జలమండలి విలీనం చేసుకోని సర్కిళ్లలో ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రజలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు ఇష్టం ఉన్న రీతిలో ధరలు పెంచుతున్న నేపథ్యంలో నీటి కొనుగోలుకు ప్రజలు చుక్కలు చూడాల్సి వస్తున్నది. దీంతో జలమండలి సర్కిళ్లను విలీనం చేసుకుని నీటి సరఫరా చేసినట్లయితే తమకు కొంత మేరకు నీటి కొనుగోలు భారం తగ్గె అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
జలమండలి ద్వారా నీటిని కొనుగోలు చేసుకుంటే రూ. 6 వందలకు 5 వేల లీటర్లు వస్తాయని, అదే ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసుకుంటే 5 వేల లీటర్ల వాటర్ ట్యాంకర్కు ప్రస్తుతం రూ. 9 వందల నుంచి రూ. 12 వందల వరకు విక్రయిస్తున్నారు. అంతేకాక ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు సరఫరా చేస్తున్న నీరు అంతగా బాగుండటం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజల కష్టాలను గుర్తించి జలమండలిలో విలీనం చేసుకుని నీటి సరఫరాను చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

