మంచినీళ్లు కరువు.. వారానికి రెండు రోజులే సరఫరా!
కాంగ్రెస్ పాలనలో నీటి కష్టాలు.. రానున్న రోజుల్లో వెస్ట్సిటీతో పాటు 3-5 లక్షల.. కుటుంబాలకు తీవ్ర నీటి ఎద్దడి
మూడు రోజులకు ఒకసారే సరఫరా చేసేందుకు జలమండలి కసరత్తుత్వరలోనే అమలు చేసేందుకు అధికారుల సన్నాహాలు మంచినీటి ముప్పు ముంచుకొస్తున్నది. మరికొద్ది రోజుల్లోనే మహానగరం తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కోనున్నది. ఎల్నినో, వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. దీంతో బోర్లన్నీ ఎండిపోయి అన్ని వర్గాల ప్రజలు జలమండలి నీటిపైనే ఆధారపడుతున్నారు. ట్యాంకర్ల డిమాండ్ అక్టోబర్లోనే వేసవిని తలపిస్తున్నది. నగరానికి తాగునీరందించే సింగూరు, మంజీరా నీటి మట్టాలు డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నాయి.
-సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ)
వెస్ట్సిటీతో పాటు నగరంలోని పలు ప్రాంతాలకు నీటి ఎద్దడి మరింత తీవ్రం కానున్నది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా కావాల్సినన్నీ నీటిని సేకరించలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో జలమండలి సరఫరాను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రోజు విడిచి రోజు తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. దాన్ని కాస్తా మూడు రోజులకోసారి చేయాలని ప్రభుత్వం జలమండలిని ఆదేశించింది. ఈమేరకు ఎల్నినో, వర్షాభావ పరిస్థితులపై నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జలమండలికి ఆదేశాలు జారీచేశారు.
ఇప్పటి నుంచి అమలు చేసి ప్రజలను నీటి ఎద్దడికి సిద్ధం చేయాలని సూచించారు. దీంతో మూడు రోజులకు ఒకసారి మాత్రమే సరఫరా చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలతో నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ప్రజలను ముందుగానే సంసిద్ధులను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి నుంచే వారానికి రెండు రోజులే తాగునీరు సరఫరా చేసేందుకు క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఎల్నినో, వర్షాభావ పరిస్థితుల వల్ల నగరంలో పగటి ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. దీంతో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతూ బోర్లన్నీ ఎండిపోతున్నాయి.
ఈ పరిస్థితి ముఖ్యంగా వెస్ట్ సిటీలోని గచ్చిబౌలి, మదాపూర్, కొండాపూర్, సైబర్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో బోర్లన్నీ ఎండిపోయి ఇప్పటికే నీటి కొరత ప్రారంభమైంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోనూ ఇదేపరిస్థితి నెలకొంది. అదేవిధంగా విలీన మున్సిపాలిటీల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ము ఖ్యంగా బోడుప్పల్, ఫిర్జాదీగూడ వంటి ప్రాంతా ల్లో బోర్లు ఎండిపోయి తాగునీటి కోసం అల్లాడుతున్నారు.
రానున్న రోజుల్లో ఆయా ప్రాం తాలతో పాటు జలమండలి పరిధిలోని 3 లక్షల నుంచి 5 లక్షల కనెక్షన్లకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదముంది. దీంతో ఈప్రాంతాల్లో వారానికి రెండే రోజులు నీటి సరఫరా చేస్తే మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే నీటి ఎద్దడితో అవస్థలు పడుతుంటే ప్రభుత్వం మూడురోజులకోసారి నీటి సరఫరా చేస్తామని ప్రకటించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాం తాల్లో మూడు రోజుల నిబంధనను పాటించవద్దని కోరుతున్నారు. భూగర్భ జలా లు సమృద్ధిగా ఉండి బోర్లు ఎండిపోని ప్రాం తాల్లో ఆ నిబంధన అమలు చేసి తమకు ప్రస్తుతం చేస్తున్న సరఫరాను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ట్యాంకర్లకు పెరగనున్న డిమాండ్
సాధారణంగా జలమండలి ట్యాంకర్లకు ఎండాకాలంలోనే డిమాండ్ ఉంటుంది. అక్టోబర్ నుంచి జనవరి దాకా 3 వేల నుంచి 4 వేల ట్యాంకర్లు మాత్రమే బుక్ అవుతాయి. కానీ ఈసారి పరిస్థితి తీవ్రమైంది. సెప్టెంబర్ చివరి వారం నుంచే రికార్డు స్థాయిలో బుకింగ్స్ పెరుగుతున్నాయి. ప్రస్తుతం బుకింగ్స్ 7వేలకు పైగా అవుతున్నాయి. ప్రభుత్వం జలమండలి నీళ్లను మూడు రోజులకు ఒకసారే సరఫరా చేయాలని నిర్ణయించడంతో బుకింగ్స్ భారీగా పెరగనున్నాయి. డిసెంబర్ నుంచి బుకింగ్స్ 10 వేలకు పైగా పెరిగే అవకాశం ఉంది.
సింగూరు, మంజీరా డెడ్ స్టోరేజీకి చేరుకుంటే ట్యాంకర్లకు కేటాయించే నీరు కూడా తగ్గనుంది. దీంతో బుక్ చేసిన ట్యాంకర్ కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జలంమండలి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తేనే ట్యాంకర్ల డిమాండ్ను కాస్త తగ్గించే అవకాశం ఉంటుంది. మరోవైపు పరిశ్రమలు, కమర్షియల్ కాంప్లెక్సులు, గేటెడ్ కమ్యూనిటీలకు అక్రమంగా చేస్తున్న సరఫరాపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. బస్తీలు, కాలనీలకు సరఫరా చేయాల్సిన నీటిని ధనవంతుల ఇండ్లు, పరిశ్రమలకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని నియంత్రిస్తే బస్తీలు, కాలనీల్లో నీటి ఎద్దడిని కొంతమేర నియంత్రించవచ్చు. జలమండలి అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

