ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ!
పండగలు వస్తే చాలు ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికులను దోచుకుంటున్నది. దసరా పండక్కి రద్దీ పెరుగడంతో దూరంతో సంబంధం లేకుండా ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ఏకంగా 50 శాతం టికెట్ ధరను పెంచి ప్రయాణికుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నది. ఉప్పల్ నుంచి తొర్రూర్‌కు సూపర్ లగ్జరీ టికెట్ ధర గతంలో రూ.300 వరకు ఉండగా..
- రెగ్యులర్ బస్సులు పక్కనపెట్టి.. స్పెషల్ బస్సులు
- రద్దీ ఎక్కువగా ఉన్న చోట దోపిడీ
- స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): పండగలు వస్తే చాలు ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికులను దోచుకుంటున్నది. దసరా పండక్కి రద్దీ పెరుగడంతో దూరంతో సంబంధం లేకుండా ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ఏకంగా 50 శాతం టికెట్ ధరను పెంచి ప్రయాణికుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నది. ఉప్పల్ నుంచి తొర్రూర్‌కు సూపర్ లగ్జరీ టికెట్ ధర గతంలో రూ.300 వరకు ఉండగా.. 50 శాతం అదనపు పెంపుతో రూ.430కి పెరిగింది. మహబూబ్‌నగర్ నుంచి ఎంజీబీఎస్‌కు సూప ర్ లగ్జరీ ధర మొన్నటివరకు రూ.220 ఉండ గా.. ఇప్పుడు రూ.290 పైగా వసూలు చేస్తున్నారు.
దసరా పండుగ ఉత్సాహంతో బస్కెక్కినవారికి.. టికెట్ రేట్లు చూడగానే ఆనందం ఆవిరైపోతున్నది. పండక్కు ఇంటికి వెళ్లాలనుకున్న తమను అదునుచూసి ఆర్టీసీ సంస్థ నిలువుదోపిడీ చేస్తున్నదని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ.100 ఉంటే.. స్పెషల్ బస్సుల పేరుతో రూ.150 వరకు వసూలు చేస్తున్నారు. రూ.200 టికెట్ ధర ఉంటే.. రూ.300, రూ.320, రూ.350 వరకూ బస్సును బట్టి తీసుకుంటున్నారు. అయితే, పెరిగిన ధరలను చూపిస్తూ ప్రయాణికులు ఆర్టీసీ దోపిడీని సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు.
రెగ్యులర్ బస్సులను ఆపి..
ప్రయాణికులను దోపిడీ చేసేందుకు ఈ దసరాకు సుమారు 7 వేలకు పైగా స్పెషల్ బస్సులను సర్కార్ రెడీ చేసింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు రెగ్యులర్‌గా ఆయా రూట్లలో తిరిగే బస్సులను డిపోల్లోనే ఉంచి.. స్పెషల్ బస్సులను పాయింట్ మీదకు తీసుకొస్తున్నారు. రెగ్యులర్ బస్సులు ఎంతకూ రాకపోవడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో స్పెషల్ బస్సులను ఎక్కుతున్నారు. శనివారం, ఆదివారం సెలవు, సద్దుల బతుకమ్మ కావడం, మంగళవారం దసరా ఉండటంతో అన్నిచోట్లా రద్దీ పెరిగింది. శనివారం ఒక్క ఖమ్మం రూట్లోనే దాదాపు 130కి పైగా బస్సులు నడిపితే.. అందులో సుమారు 60 వరకు స్పెషల్ బస్సులే ఉన్నట్టు తెలిసింది. రెగ్యులర్ బస్సులు తక్కువగా ఉండటంతో శనివారం మధ్యాహ్నం నుంచే అన్ని బస్స్టాండ్లలో విపరీతమైన రద్దీ కనిపించింది.

హెల్ప్‌లెస్‌గా.. హెల్ప్‌లైన్ కౌంటర్లు
ప్రయాణికుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్లు చాలాచోట్ల హెల్ప్‌లెస్‌గా మారాయని చెప్తున్నారు. ఉచిత బస్సుల సమాచారం కోసం పిల్లాపాలలతో బస్సుల సమాచార కేంద్రాలకు వెళ్తే హెల్ప్‌లైన్ గుడారాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ సమస్య హైదరాబాద్‌లో ప్రధాన బస్టాండులైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌తో పాటు ప్రయాణికుల రద్దీ ఎకువగా ఉండే కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో కనిపించింది.
పల్లెలకు కదిలిన పట్టణం!
పల్లెబాట పట్టిన పట్నంవాసులతో తెలంగాణ రహదారులు రద్దీగా మారుతున్నాయి. నగరాల్లో నివసించేవారంతా పండుగవేళ సొంతూళ్లకు బయలుదేరడంతో జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు పెరిగాయి. ముఖ్యంగా టోల్గేట్ల వద్ద కార్లు, ఇతర వాహనాలు బారులు తీరుతున్నాయి. పండుగకు కొద్దిరోజులే మిగిలి ఉండటంతో కుటుంబసమేతంగా స్వగ్రామాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతున్నది. తెలంగాణలోని అనేక కుటుంబాలు ఉపాధి, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాల్లో నివసిస్తున్నాయి.
పండుగలు, ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు సొంతూళ్లకు వెళ్లి కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో గడపడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ నేపథ్యంలో బతుకమ్మ, దసరా పండుగవేళ పల్లెలకు వెళ్లేందుకు చాలామంది ప్రాధా న్యం ఇస్తున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో పండుగ ప్రయాణాల సందడి కనిపిస్తున్నది. టోల్గేట్ల వద్ద వాహనాల రాకపోకలు పెరుగడంతో కొన్ని సమయాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

