కాంట్రాక్టర్లపై చార్జీల పిడుగు!
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లపై మరో ఊహించని భారాన్ని మోపింది.
- ఈ ప్రొక్యూర్మెంట్ ఫీజుల మోత
- బిల్లులు రాక ఇప్పటికే విలవిల
- ప్రాజెక్టు విలువ ఎంత పెరిగితే గుత్తేదార్ల జేబులకు అంత కన్నం
- చిన్న కాంట్రాక్టర్లకూ తప్పని ఈ కార్పస్
- గతం కంటే మూడింతలు రెట్టింపు చార్జీలు
సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లపై మరో ఊహించని భారాన్ని మోపింది. ఒకవైపు పాత బకాయిలు, చేసిన పనులకు సంబంధించి వేల కోట్ల రూపాయల బిల్లులు రాక గుత్తేదారులు అప్పుల ఊబిలో విలవిలలాడుతుంటే, వారి నడ్డి విరిచే విధంగా ఈ-ప్రొక్యూర్మెంట్ చార్జీల పేరుతో సరార్ మరొక పిడుగును విసిరింది. ఈ-ప్రొక్యూర్మ్మెంట్ టెండర్లలో ఫీజుల విధింపునకు సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ఐఈటీఈ సవరణలతో జీవో నంబరు 6ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి అమలులోకి రావడం ద్వారా ప్రభుత్వ పనుల్లో పాల్గొనే కాంట్రాక్టర్లు, బిడ్డర్లపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది.
ఇప్పటివరకు భారీ బడ్జెట్ టెండర్లపై కాంట్రాక్టర్లకు అప్పర్ క్యాప్ ఉండేది. ఉదాహరణకు 50 కోట్ల లోపు ప్రాజెక్టులపై 10,000, ఆపై పనులపై రూ. 25,000 గరిష్ఠ రుసుము మాత్రమే వసూలు చేసేవారు. అయితే కొత్త జీఓ ప్రకారం ఈ గరిష్ట పరిమితిని పూర్తిగా ఎత్తివేశారు. దీనివల్ల ప్రాజెక్టు విలువ ఎంత పెరిగితే దానికి తగినట్లుగా కాంట్రాక్టర్ల జేబులకు అంత పెద్ద కన్నం పడుతుందని కాంట్రాక్టర్ల అసోసియేషన్ మండిపడుతున్నది. కాగా గతంలో చిన్న పనులను ప్రోత్సహించేందుకు 10 లక్షల లోపు విలువైన టెండర్లకు ఈకార్పస్ నుంచి మినహాయింపు ఇచ్చేవారు. అయితే తాజా జీఓ ప్రకారం ఈ మినహాయింపును రద్దు చేశారు. ఫలితంగా చిన్న తరహా వర్లు చేసే కాంట్రాక్టర్లు కూడా తప్పనిసరిగా బాదుడుకు గురికావాల్సి వస్తోంది.
రుసుముల కొత్త బాదుడు వివరాలు
- ఈ-ప్రొక్యూర్మ్మెంట్ ప్లాట్ ఫారమ్లో బిడ్ దాఖలు చేసే ప్రతీ బిడ్డర్ అంచనా ఒప్పంద విలువ లేదా కోట్ చేసిన మొత్తం విలువపై 0.05% చొప్పున ట్రాన్సాక్షన్ ఫీజు చెల్లించాలి
- ప్రొడక్ట్, ఈపీసీ టెండర్లకు వారు దాఖలు చేసిన మొత్తం కోటెడ్ వ్యయంలో 0.05% వర్తిస్తుంది.
- ఈ ఫీజు కనీస మొత్తం 1,000గా నిర్ణయించారు.
- టెండర్ దకించుకున్న కాంట్రాక్టర్ (ఎల్1 బిడ్డర్) వర్ ఆర్డర్ పొందేముందు లేదా అగ్రిమెంట్ కుదుర్చుకునే సమయంలో ఈపీసీలో 0.05% మొత్తాన్ని ఈకార్పస్ విరాళంగా సమర్పించాలి. దీనికి కూడా కనిష్ఠ పరిమితి 1,000 ఉంటుంది.
- ఈ ఫీజులతో పాటు చట్టబద్ధంగా వర్తించే టాక్స్లు (జీఎస్టీ), బ్యాంక్ గేట్ వే చార్జీలను కాంట్రాక్టర్లే సొంతంగా భరించాల్సి ఉంటుంది.
రాబడి పంపిణీ నిష్పత్తి
వసూలు చేసిన ఈ నిధులను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటీడ్ కింద ఐటీ శాఖకు 70శాతం, సంబంధిత శాఖ/ఏజెన్సీ 25 శాతం, టీజీటీఎస్ (ఫండ్ మేనేజర్కు 5 శాతం) చెల్లించాల్సి ఉంటుంది. ‘చేసిన పనుల బిల్లుల కోసం ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పైసా విదల్చని ప్రభుత్వం, ఇప్పుడు కొత్త రకం చార్జీలు రుద్ది మమ్మల్ని మరింత కోలుకోలేని దెబ్బతీస్తోంది’ అని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చైర్మన్ హనుమంత్ సాగర్, వైస్ చైర్మన్లు గుంటి సాయి కిరణ్, సంపంగి రమేశ్, జి. లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల నుంచి తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక నలిగిపోతున్న తమను, ఈ పెంచిన ఫీజులతో రోడ్డున పడేసేలా జీవోలు తెచ్చారని వాపోతున్నారు. తక్షణమే ఈ పెంచిన ఈ-ప్రొక్యూర్ మెంట్ చార్జీల ఉత్తర్వులను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పనులను నిలిపివేసి ఆందోళనలకు దిగుతామని కాంట్రాక్టర్లు
హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

