దసరాకు ఊరెళ్తున్నారా.. జాగ్రత్త!
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు సిద్ధమవుతు న్నారు. ఇప్పటికే చాలామంది కుటుంబాలతో కలిసి పల్లెబాట పట్టగా, మరికొందరు ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఇండ్లకు తాళాలు వేసి రోజుల తరబడి దూరంగా ఉండే పరిస్థితులను దొంగలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం లేకపోలేదు.
- గ్రేటర్లో దొంగల కలకలం..
- తాళం వేసిన ఇండ్లే లక్ష్యంగా చోరీల ముప్పు
- పండుగ వేళ అప్రమత్తతే అసలైన రక్షణ
- ఇంటి భద్రతపై నిర్లక్ష్యం వద్దు
సిటీబ్యూరో,అక్టోబర్17(నమస్తే తెలంగాణ): దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు సిద్ధమవుతు న్నారు. ఇప్పటికే చాలామంది కుటుంబాలతో కలిసి పల్లెబాట పట్టగా, మరికొందరు ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఇండ్లకు తాళాలు వేసి రోజుల తరబడి దూరంగా ఉండే పరిస్థితులను దొంగలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం లేకపోలేదు. గతనెలలో సైబరాబాద్ , మలాజిగిరి పోలీసు కమిషనరేట్ల పరిధిలో చోటుచేసుకున్న వరుస దొంగతనాల నేపథ్యంలో పండుగ సెలవులు పోలీసులకు మరో సవాలుగా మారుతున్నాయి. ప్రజలు పండుగ సంబరాల్లో నిమగ్నమయ్యే వేళ తమ ఇండ్ల భద్రతను విస్మరిస్తే, తిరిగి వచ్చేసరికి విలువైన వస్తువులు మాయమయ్యే ప్రమాదం లేకపోలేదు.
తాళం కనిపిస్తే చాలు.. రెకీ చేసి మరీ చోరీలు!
నగరంలోని అపార్ట్మెంట్లు, కాలనీలు, విల్లాలు, శివారు ప్రాంతాల్లోని నివాస గృహాలే దొంగల లక్ష్యంగా మారే అవకాశం ఉంది. ఇంటికి తాళం వేసి ఉందా? వరుసగా ఎన్ని రోజుల నుంచి ఎవరూ రావడం లేదా? పరిసరాల్లో కదలికలు ఎలా ఉన్నాయి? అనే అంశాలను గమనిస్తూ రెకీ చేసే దొంగలు, అనువైన సమయం చూసుకుని చోరీలకు పాల్పడే ప్రమాదం ఉంది. ఇటీవల జరిగిన నార్సింగి చడ్డీ గ్యాంగ్ ఘటన, హయత్నగర్లోని నగల దుకాణం చోరీ, ఇళ్లలో జరిగిన వరుస చోరీలు తదితర వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం.
పోలీసులకు పండుగ వేళ సవాల్
దసరా సమయంలో నగరంలోని అనేక కుటుంబాలు ఒకేసారి స్వగ్రామాలకు వెళ్లడం, కొన్ని నివాస ప్రాం తాల్లో రాకపోకలు తగ్గడం భద్రతాపరమైన ఇబ్బందులకు దారితీయవచ్చు. మరోవైపు పండుగ వేడుకలు, రద్దీ ప్రాంతాల్లో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ వంటి విధుల మధ్య నివాస ప్రాంతాలపై నిఘా కొనసాగించడం పోలీసు లకు సవాలే. అయితే పోలీసుల అప్రమత్తతతో పాటు ప్రజల సహకారం కూడా అంతే అవసరం. కాలనీల సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు, సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తే అనుమానాస్పద కదలికలను త్వరగా గుర్తిం చే అవకాశం ఉంటుంది.
ఊరికి వెళ్లే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
1. తలుపులు, కిటికీలు తనిఖీ చేయాలి
ఇంటి ప్రధాన ద్వారంతో పాటు వెనుక తలుపులు, బాలనీ తలుపులు, కిటికీలను సరిగా మూసి తాళాలు వేయాలి. అదనపు భద్రతా ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలి.
2. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తత
నగదు,బంగారు ఆభరణాలు, విలువైన పత్రాలను బ్యాంకు లాకర్ లేదా తగిన భద్రత ఉన్న ప్రదేశంలో భద్రపర్చడం ఉత్తమం.
3. నమ్మకమైన వ్యక్తికి సమాచారం ఇవ్వాలి
ఇంటి పకన ఉండే విశ్వసనీయ పొరుగువారికి లేదా బంధువులకు ప్రయాణ వివరాలు తెలియజేయాలి. వీలైతే అప్పుడప్పుడు ఇంటి పరిసరాలను గమనించేలా ఏర్పాటు చేసుకోవాలి.
4. సీసీటీవీ, అలారం పనిచేస్తున్నాయో లేదో సరి చూడాలి
ఇంట్లో కెమెరాలు, స్మార్ట్ డోర్ లాక్లు, అలారం ఉంటే అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే పరీక్షించాలి. మొబైల్లో అలర్ట్లు అందుతున్నాయో కూడా నిర్ధారించుకోవాలి. సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం మంచిది.
5. సోషల్ మీడియాలో పోస్టులు వద్దు
ఊరికి వెళ్తున్నట్లు, ఇల్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపే వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడం మంచిది. ప్రయాణ ఫొటోలు, కచ్చితమైన ప్రయాణ తేదీలు, ఇంటి ఖాళీ వివరాలను సోషల్ మీడియా ద్వా రా దొంగలు గమనించే అవకాశం ఉన్నందున ప్రయాణ వివరాల పట్ల సోషల్ మీడియాలో జాగ్రత అవసరం.
6. తెలియని వారికి తాళాలు ఇవ్వొద్దు
ఇంటి తాళాలను తెలియని వ్యక్తులకు ఇవ్వొద్దు. సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఇంటి వద్దకు వచ్చే పనివారికి కూడా అవసరానికి మించిన వివరాలు వెల్లడించ కూడదు.
7. విద్యుత్, గ్యాస్ భద్రత
విద్యుత్ పరికరాలను ఆఫ్ చేయాలి. గ్యాస్ సరఫరాను నిలిపివేసి, విద్యుత్ భద్ర తా ఏర్పాట్లను పరిశీలించాలి. అయితే భద్రతా వ్యవస్థలకు సంబంధించిన సీసీ కెమెరాల వ్యవస్థ, అలారం వంటి వాటికి విద్యుత్ సరఫరాను నిలిపివేయకూడదు.
8. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే పోలీసులకు చెప్పండి
కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు తిరగడం, ఇండ్ల పరిసరాలను పదేపదే గమనించడం, తలుపులు లేదా కిటికీల వద్ద అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112కు కాల్ చేయవచ్చు. అనుమానితులను స్వయంగా వెంబడించడం లేదా ఎదురోవడం కంటే సురక్షితంగా ఉండి పోలీసులకు వివరాలు అందించడం మంచిది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

