హైదరాబాద్ : జపాన్ ( Japan ) దేశం హీరోషిమా ( Hiroshima ) రాష్ట్రానికి చెందిన ప్రతినిధుల బృందం తెలంగాణ శాసన మండలి, శాసన సభ( Assembly ) ను సందర్శించారు. ఈ సందర్భంగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ వారికి స్వాగతం పలికారు. మండలి చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని వివరించారు.
తెలంగాణ రాజధాని నగరంలో అన్ని దేశాలకు చెందిన ప్రజలు జీవిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి విప్లు అద్దంకి దయాకర్ , వెంకట నర్సింగరావు , ఎమ్మెల్సీలు దాసోజు శ్రావణ్ , అంజి రెడ్డి , ఎమ్మెల్యేలు టి రామ్మోహన్ రెడ్డి , పాల్వాయి హరీష్ , శాసన మండలి సెక్రెటరీ డా. నర్సింహాచార్యులు , శాసన సభ సెక్రెటరీ ఆర్. తిరుపతి తదితరులు పాల్గొన్నారు.