గువాహటి: అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మంగళవారం వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
వీరిలో రామేశ్వర్ తెలి(బీజేపీ) అజంతా నియోగ్(బీజేపీ), అతుల్ బోరా (ఏజీపీ) చరణ బోరో(బీపీఎఫ్) ఉన్నారు.