బెంగళూరు: ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకున్న బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ ‘ధ్యాన మందిరం’.. ప్రపంచ ధ్యాన కార్యక్రమానికి వేదిక కాబోతున్నది. గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలో బుధవారం రాత్రి 7.30 గంటలకు నిర్వహిస్తున్న ‘ప్రపంచ శాంతి కోసం గురుదేవ్తో ప్రపంచ ధ్యానం’ అనే కార్యక్రమంలో 182 దేశాల నుంచి లక్షలాది మంది ప్రత్యక్షంగా, లైవ్ స్ట్రీమ్ ద్వారా పాల్గొననున్నారు.
‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45 ఏండ్ల వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న నేటి కార్యక్రమంలో కేంద్ర మంత్రులు గడ్కరీ, సుకాంత మజుందార్, సర్బానంద, మణిపూర్ సీఎం ఖేమ్చంద్, సినీ నటులు రజనీకాంత్, అల్లు అర్జున్ పాల్గొననున్నారు.