ఉద్యోగ నోటిఫికేషన్ల్లు విడుదల చేయాలి
ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లో మంగళవారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యం లో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
- దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగ జేఏసీ నిరసన ర్యాలీ
ఎల్బీనగర్, మే 12: ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లో మంగళవారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యం లో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి రాకముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు దాటినా కనీసం నిరుద్యోగుల సమస్యలపై స్పందించకపోవడం శోచనీయమన్నారు.
బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భుక్యా కుమార్, నిరుద్యోగుల జేఏసీ నాయకుడు ఇంద్రానాయక్ మాట్లాడుతూ.. నిరుద్యోగులను అన్ని విధాలుగా వాడుకుని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ప్రభు త్వం కల్లబొల్లి మాటాలతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమం లో నిరుద్యోగ జేఏసీ నాయకులు షింబు నాయక్, బాల కోటి, నవీన్ పట్నాయక్, శంకర్, ఉపేందర్, అశోక్, రాంచంద్రారెడ్డి, సత్య, సరస్వతి, అనితతో పాటుగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్‌కుమార్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, గండి సన్నియాదవ్, రమణారెడ్డి, సొంటి చంద్రశేఖర్‌రెడ్డి, ప్రతీక్, విజయలక్ష్మి, శైలజ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

