షిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లో నెల రోజుల్లో 550 మందికిపైగా విద్యార్థులు కొవిడ్-19 పాజిటివ్‌గా పరీక్షించినట్లు రాష్ట్ర ఆరోగ్య అధికారి సోమవారం తెలిపారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 25 వరకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు మహమ్మారి బారినపడ్డారని పేర్కొన్నారు. అత్యధికంగా హమీర్పూర్ జిల్లాలో 196 మంది, కంగ్రాలో 173, ఉనాలో 104, మండిలో 26, షిమ్లాలో 22, కిన్నౌర్‌లో 14తో పాటు పలు జిల్లాల్లో విద్యార్థులు వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షలు చేశారు. విద్యార్థుల్లో ఇప్పటికీ 250 మంది వైరస్‌తో బాధపడుతున్నారని, 305 మంది కోలుకున్నారని అధికారి తెలిపారు.
రాష్ట్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం నాటికి రాష్ట్రంలో 1,415 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో ఆరో వంతు కంటే ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. ఇటీవల హమీర్పూర్ జిల్లాలో 13 సంవత్సరాల విద్యార్థిని వైరస్ బారినపడి మృతి చెందిందని ఆరోగ్యశాఖ అధికారి చెప్పారు. ఆమె కుటుంబంతో వివాహ కార్యక్రమానికి హాజరైన వెంటనే అనారోగ్యానికి గురైందని, తర్వాత గొంతు ఇన్ఫెక్షన్ వచ్చిందని, అనంతరం తర్వాత గొంతు ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు. అనంతరం ఆమె వైరస్ బారినపడ్డట్లు తేలిందని, ఆ తర్వాత మరణించిందని వివరించారు.