‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’ | విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలలకు రావాల్సిన అవసరం లేదని తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది. జూలై ఒకటి నుంచి పాఠశాలల ప్రారంభంపై బుధవారం

హైదరాబాద్ : విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలలకు రావాల్సిన అవసరం లేదని తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది. జూలై ఒకటి నుంచి పాఠశాలల ప్రారంభంపై బుధవారం రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలల ప్రారంభంపై విద్యాశాఖ ఉన్నత న్యాయస్థానానికి వివరణ ఇచ్చింది. అన్ని తరగతుల విద్యార్థులు హాజరు కావాలా? అని కోర్టు ప్రశ్నించగా.. మూడ్రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పింది. తరగతి గదుల్లో ప్రత్యక్ష బోధనతో పాటు ఆన్లైన్ తరగతులు జరుగుతాయని కోర్టుకు తెలిపింది. విద్యాసంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టమని విచారణ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. హైకోర్టు అభిప్రాయాన్నీ దృష్టిలో ఉంచుకొని త్వరలోనే విధివిధానాలు ఖరారు చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా కోర్టుకు తెలిపారు. ఈ మేరకు వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యాశాఖను కోర్టు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
నేటి నుంచి పటాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు
నేడు కేంద్ర కేబినెట్ భేటీ!
కరోనా టీకా డ్రైవ్‌లో మరో మైలురాయి దాటిన భారత్
మిక్సింగ్ టీకాలు తీసుకున్న ఇటలీ ప్రధాని
డివైడర్‌ను ఢీకొట్టిన వాహనం.. నలుగురు దుర్మరణం
12 అంతస్తుల భవనంపై నుంచి దూకి తల్లీకొడుకుల ఆత్మహత్య
నేడు 86వేల మంది అన్నదాతల ఖాతాల్లోకి ‘రైతుబంధు’
దేశంలో 3కోట్లు దాటిన కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

