బోథ్, నవంబర్ 2 : నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కోర్టు భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ఆదేశించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని కోర్టు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టరు, ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు.
జిల్లా ప్రధాన న్యా యమూర్తి కె.ప్రభాకర్‌రావు, బోథ్ కోర్టు న్యా యమూర్తి పి.మౌనిక, బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు వామన్‌రావు దేశ్‌పాండే, సెక్రటరీ పంద్రం శంకర్, అడిషనల్ ఎస్పీ సురేందర్‌రా వు, డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ సుభాష్ చందర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ గురుస్వామి, ఏపీపీ శ్రీధర్, న్యాయవాదులు ఆడెపు హరీశ్, ఠాకూర్ రూపేందర్ సింగ్, కుమ్మరి విజయ్‌కుమార్, చౌహాన్ విక్రమ్‌సింగ్, వివేక్‌సింగ్, రాములు పాల్గొన్నారు.
నిర్మల్ చైన్‌గేట్, నవంబర్ 2 : న్యాయస్థానం మధ్యవర్తిత్వ(మీడియేషన్) విధానం ప్రవేశపెట్టిందని హైకోర్టు జడ్జి, మీడియేషన్ కమిటీ చై ర్మన్ జస్టిస్ కె.లక్ష్మణ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం శిక్షణ తరగతులను ఆ యన ప్రారంభించారు. జిల్లా జడ్జి శ్రీవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక అటవీశాఖ వసతి గృహంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీన, ఆర్డీవో రత్నకల్యాణి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు.