తాండూర్ : దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని సీఐటీయూ (CITU ) జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్( Ranjit Kumar) అన్నారు. తాండూర్ మండలం కేంద్రంలోని హమాలీ కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నవంబర్ 15, 16న జరుగనున్న సీఐటీయూ 3వ జిల్లా మహాసభల కరపత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారులకు అనుగుణంగా వారికి లాభాలు చేకూర్చే విధంగా లేబర్ కోడ్స్( Labour Codes) అమలు చేయాలని చూస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ జీవో 282 ను తెచ్చిందని, పని గంటలు తగ్గించాల్సిన ప్రభుత్వమే పని గంటలు పెంచుతూ కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
లేబర్ కోడ్స్ రద్దుకు ఐక్య పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్మిక రంగ సమస్యల పరిష్కారానికి జిల్లా మహాసభలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మాజీ జిల్లా అధ్యక్షులు సంకె రవి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దాగం రాజారాం, గ్రామ పంచాయతీ, కార్మికులు మహమ్మద్ ఆకలి అలీ, బాబా అక్బర్ అలీ, రైస్ మిల్ అండ్ బజార్ హమాలి సంఘం నాయకులు కార్మికులు చింతపురి లక్ష్మణ్, తాండూర్ మల్లేష్, తొగరి శ్రీను, కొప్పుల స్వామి, కొమ్మ శంకర్, పుర్ర రాగులయ్య, బుద్ధార్థి శంకర్, ఐ శంకర్, కొండు రాగులు, రాజయ్య, పూదరి తిరుపతి, పుట్ట రమణ, కార్మికులు పాల్గొన్నారు.