మాజీ జీహెచ్ఎంసీ కమిషనర్ కె.ఇలంబర్తి, ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నపటికి RTI చట్టం కింద సమాచారం ఎందుకు అందజేయలేదని కోర్టు వీరికి నోటీసులు ఇచ్చింది. RTI చట్టం ప్రకారం తాను అడిగిన సమాచారం అందజేయాలని నవంబర్ 24వ తేదీన హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను, అధికారులు పట్టించుకోలేదని మరోసారి వడ్డం శ్యామ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ విచారిస్తూ, కోర్టు ధిక్కరణ కింద వారిపై చర్యలు ఎందుకు తీసుకోవద్దో తెలపాలని ఐఏఎస్ అధికారులపై హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేదో వివరిస్తూ జనవరి 26వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని, లేదంటే వారి అఫిడవిట్లు స్వీకరించమని, రూ.10,000 జరిమానా కూడా విధించాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించిన