హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : కేవలం ఆరుగురు ఎస్టీలున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం గ్రామంలో సర్పంచ్ పదవితో పాటు మూడు వార్డులను ఎస్టీలకు కేటాయించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల కేటాయింపు తీరు ను తీవ్రంగా తప్పుబట్టింది. 2025 ఓటర్ల జాబితా ను పరిగణనలోకి తీసుకోకుండా 2011 జనాభా లెకల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయడం సరి కాదని పేర్కొన్నది. మహమూద్‌పట్నం సర్పంచ్ పోస్టును ఎస్టీ మహిళకు కేటాయించడాన్ని మిట్టగ డుపుల యాకూబ్ గురువారం వేసిన లంచ్‌మోషన్ పిటిషన్ ను జస్టిస్ మాధవీదేవి విచారించారు.
గ్రామంలో 2025 ఓటర్ల జాబితా ప్రకారం 576మంది ఓ టర్లున్నారని, అందులో కేవలం ఆరుగురు ఎస్టీలున్న వారికి సర్పంచ్, మూడు వార్డులను రిజర్వ్ చేశారని పిటిషనర్ న్యాయవాది రమేశ్ విల్లా వాదించారు. 250మంది ఎస్సీలు, 300మంది బీసీలు, 20కి పైగా ఓసీలు ఉన్నారని తెలిపారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన నో టిఫికేషన్‌లో ఎస్సీ జనరల్ మహిళకు కేటాయించిన అధికారులు, ఇప్పుడు ఎస్టీల కు కేటాయించారని తెలిపారు. ఈ వ్యవహారంపై గతేడాది ఆగస్టు 23న, ఈ నెల 24న ఇచ్చిన వినతులపై చర్యలు తీసుకోకుండా రిజర్వేష న్లు ఖరారు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. పిటిషనర్ల వినతిపత్రాలపై చర్యలు తీసుకునే వరకు మహమూద్‌పట్నం గ్రామ పంచాయతీ ఎన్నికను ని లిపివేస్తున్నట్లు ప్రకటించి విచారణను డిసెంబరు 29కి వాయిదా వేసింది.