ఆరుగురు ఎస్టీలకు సర్పంచ్, 3 వార్డులా.. తీవ్రంగా తప్పుపట్టిన హైకోర్టు
కేవలం ఆరుగురు ఎస్టీలున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం గ్రామంలో సర్పంచ్ పదవితో పాటు మూడు వార్డులను ఎస్టీలకు కేటాయించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల కేటాయింపు తీరు ను తీవ్రంగా తప్పుబట్టింది.
- నిర్ణయం తీసుకునే వరకు మహమూద్‌పట్నం ఎన్నిక నిలిపివేత
హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : కేవలం ఆరుగురు ఎస్టీలున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం గ్రామంలో సర్పంచ్ పదవితో పాటు మూడు వార్డులను ఎస్టీలకు కేటాయించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల కేటాయింపు తీరు ను తీవ్రంగా తప్పుబట్టింది. 2025 ఓటర్ల జాబితా ను పరిగణనలోకి తీసుకోకుండా 2011 జనాభా లెకల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయడం సరి కాదని పేర్కొన్నది. మహమూద్‌పట్నం సర్పంచ్ పోస్టును ఎస్టీ మహిళకు కేటాయించడాన్ని మిట్టగ డుపుల యాకూబ్ గురువారం వేసిన లంచ్‌మోషన్ పిటిషన్ ను జస్టిస్ మాధవీదేవి విచారించారు.
గ్రామంలో 2025 ఓటర్ల జాబితా ప్రకారం 576మంది ఓ టర్లున్నారని, అందులో కేవలం ఆరుగురు ఎస్టీలున్న వారికి సర్పంచ్, మూడు వార్డులను రిజర్వ్ చేశారని పిటిషనర్ న్యాయవాది రమేశ్ విల్లా వాదించారు. 250మంది ఎస్సీలు, 300మంది బీసీలు, 20కి పైగా ఓసీలు ఉన్నారని తెలిపారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన నో టిఫికేషన్‌లో ఎస్సీ జనరల్ మహిళకు కేటాయించిన అధికారులు, ఇప్పుడు ఎస్టీల కు కేటాయించారని తెలిపారు. ఈ వ్యవహారంపై గతేడాది ఆగస్టు 23న, ఈ నెల 24న ఇచ్చిన వినతులపై చర్యలు తీసుకోకుండా రిజర్వేష న్లు ఖరారు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. పిటిషనర్ల వినతిపత్రాలపై చర్యలు తీసుకునే వరకు మహమూద్‌పట్నం గ్రామ పంచాయతీ ఎన్నికను ని లిపివేస్తున్నట్లు ప్రకటించి విచారణను డిసెంబరు 29కి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

