MS Subbalakshmi | ప్రముఖ లెజెండరీ క్లాసికల్ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి (MS Subbalakshmi) బయోపిక్కు సంబంధించి నెట్టింట ఏదో ఒక వార్త హాట్ టాపిక్‌గా నిలుస్తుందని తెలిసిందే. జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ కోసం సాయి పల్లవి, రుక్మిణి వసంత్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కన్నడ సోయగం రష్మిక మందన్నా పేరు తెరపైకి వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయింది. అయితే ఇంతకీ ఎవరు ఎంఎస్ సుబ్బలక్ష్మిగా కనిపించబోతున్నారనేది ఫైనల్ అప్డేట్ వచ్చింది.
ఐకానిక్ సింగర్ పాత్రలో రష్మిక మందన్నాను ఫైనల్ చేసినట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. ఈ బయోగ్రాఫికల్ డ్రామా కోసం ఇటీవలే రష్మిక మందన్నా నివాసంలో లుక్ టెస్ట్ కూడా పూర్తి చేశారని.. పాపులర్ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ప్రత్యేకించి ఈ సెషన్ కోసం కాస్ట్యూమ్స్‌ను కూడా రూపొందించినట్టు ఇన్సైడ్ టాక్. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉండబోతుందట.
పాపులర్ మ్యూజిక్ కంపోజర్ మరోసారి గౌతమ్ తిన్ననూరితో కలిసి పనిచేయనున్నాడు. ఈ ఇద్దరూ మరోసారి వర్క్ చేయనుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నేషనల్ క్రష్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన్నా మరి ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌తో ఏ రేంజ్‌కు వెళ్తుందోనని నెటిజన్లు, మూవీ లవర్స్, అభిమానులు అప్పుడే చర్చించుకోవడం మొదలుపెట్టారు .
Vadde Naveen | వడ్డే నవీన్ సినిమాలో నటించిన సుమ.. 26 ఏళ్ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసిన ఇంటర్వ్యూ
Chiranjeevi New Movie | మెగా 158 అప్డేట్: చిరంజీవి-బాబీ మూవీలో కన్నడ బ్యూటీ రచితా రామ్!