హైదరాబాద్,మార్చి 24 ( నమస్తే తెలంగాణ ): గత రెండు, మూడు రోజుల నుంచి వాతావరణం చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లో అకడకడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తా జాగా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. వచ్చే మూడు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాల వల్ల ఉద్యా న పంటలలో తగిన జాగ్రత్తలు తీసుకొని.. రైతులు పంటలను రక్షించుకోవాలని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ దండా రాజిరెడ్డి సూచించారు. మా మిడి, టమాట, పసుపు పంటల్లో జరిగే నష్టాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించి సలహాలు, సూచనలు చేసింది.