ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో గురువారం సాయంత్రం భారీ వర్షం ( Heavy Rains ) కురిసింది. ఆదిలాబాద్( Adilabad ) , జైనథ్ ( Jainath ) మార్కెట్లో రైతులు ఆరబెట్టిన మొక్కజొన్న పంటకు తీరని నష్టం జరిగింది. జిల్లాలో గత 15 రోజులుగా మక్క కొనుగోలు ( Maize ) జరుగుతుండగా రైతులు తమ పంటను విక్రయించడానికి మార్కెట్ యార్డుకు భారీగా మొక్కజొన్నను తీసుకువచ్చారు.

తేమ శాతంతో తోపాటు గన్ని సంచుల కొరత కారణంగా మక్క కొనుగోలులో జాప్యం జరుగుతుంది. ఆదివారం ఆదిలాబాద్ జైనథ్ మార్కెట్ యార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి అలాట్మెంట్ రాకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి.
నాలుగు రోజులుగా పంట కొనుగోళ్ల కోసం పడిగాపులు కాస్తున్న రైతులకు గురువారం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో మార్కెట్ యార్డ్ లో పంట పూర్తిగా తడిసిపోయింది. ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టకపోవడంతోనే తాము నష్టపోయామని, తడిసిన పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరారు.