Bihar Cabinet : బిహార్లో ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ గురువారం జరిగింది. మొత్తం 32 మందితో కొత్త మంత్రులతో కూడిన పూర్తిస్థాయి ప్రభుత్వం కొలువుదీరింది. ప్రస్తుతం బిహార్లో బీజేపీ, జేడీయూ, ఇతర పార్టీలతో కలిసి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. మంత్రివర్గ విస్తరణలో మాజీ సీఎం నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్కు చోటు దక్కింది. కూటమిలో బీజేపీకి 15, జేడీయూకు 13, రామ్ విలాస్ ఎల్జేపీకి 2, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం పార్టీలకు ఒక్కో మంత్రి పదవి దక్కింది.
కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పాట్నాలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్, మాజీ సీఎం నితీష్ కుమార్ హాజరయ్యారు. అలాగే కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ, లాలాన్ సింగ్, ఆర్ఎల్ఎం, ఇతర పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 202 సీట్లు గెలుచుకుంది. బీజేపీ, జేడీయూ కలిపి 174 సీట్లు సాధించాయి. కొత్త మంత్రుల పూర్తి జాబితా ఇది.
విజయ్ కుమార్ సిన్హా (బీజేపీ), దిలీప్ జైశ్వాల్ (బీజేపీ), రామ్ కృపాల్ యాదవ్ (బీజేపీ), నితీష్ మిశ్రా (బీజేపీ), మితిలేష్ తివారి (బీజేపీ), కేదార్ గుప్తా (బీజేపీ), రామా నిషద్ (బీజేపీ), ప్రమోద్ కుమార్ చంద్రవంశి (బీజేపీ), లాఖేంద్ర కుమరా రౌషన్ (బీజేపీ), సంజయ్ సింగ్ టైగర్ (బీజేపీ), కుమార్ శైలేంద్ర (బీజేపీ), రామచంద్ర ప్రసాద్ (బీజేపీ), శ్రేయాసి సింగ్ (బీజేపీ), నంద కిషోర్ (బీజేపీ), అరుణ్ శంకర్ ప్రసాద్ (బీజేపీ), శ్రావణ్ కుమార్ (జేడీయూ), అశోక్ చౌదరి (జేడీయూ), లేషీ సింగ్ (జేడీయూ), మదన్ సాహ్ని (జేడీయూ), మొహమ్మద్ జామా ఖాన్ (జేడీయూ), సునీల్ కుమార్ (జేడీయూ), షీలా మండల్ (జేడీయూ), రత్నేష్ సదా (జేడీయూ), బూలో మండల్ (జేడీయూ), భగవాన్ సింగ్ కుష్వాహా (జేడీయూ), దామోదర్ రావత్ (జేడీయూ), నిశాంత్ కుమార్ (జేడీయూ), శ్వేతా గుప్తా (జేడీయూ), సంజయ్ పాశ్వాన్ (ఎల్జేపీ–ఆర్వీ), సంజయ్ సింగ్ (ఎల్జేపీ–ఆర్వీ), సంతోష్ సుమన్ (హెచ్ఏఎం–ఎస్), దీపక్ ప్రకాశ్ (ఆర్ఎల్ఎం).