Healthy Skin | ఆహారంతో.. చర్మ ఆరోగ్యం!

మొటిమలు, మచ్చలు లేని చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ తరచూ మొటిమలతో పాటు వాటివల్ల ఏర్పడే మచ్చలు, పిగ్మెంటేషన్ మొదలైన వాటితో ఇబ్బంది పడుతుంటారు. మచ్చలేని చర్మం కావాలంటే మాత్రం, ఆహారంలో మార్పులు చేసుకోవాలి. చర్మానికి మేలు చేసే పదార్థాలను తీసుకోవాలి.
ఆకుకూరలు-కూరగాయలు : చర్మంలోని మెలానిన్ అనే పదార్థానికి పిగ్మెంట్ పవర్ కోసం క్యాబేజీ, పాలకూర, ఆకుపచ్చని కూరగాయలు తినాలి. దీనివల్ల పిగ్మెంటేషన్ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
పండ్లు : దానిమ్మ, బొప్పాయి, స్ట్రాబెర్రీ, నారింజ మొదలైన పండ్లు చర్మం మృదువుగా ఉండేలా చేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్నే కాదు, గుండె జబ్బులనూ దూరం చేస్తాయి. ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నివారిస్తాయి.
పెరుగు : దీనిలోని క్యాల్షియం, ప్రొటీన్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. చర్మ ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి. మచ్చలు, దురదను దూరం చేస్తాయి.
నీళ్లు : శరీరానికి సరిపడా నీళ్లు అందితేనే, ముఖం మృదువుగా, కాంతిమంతంగా కనిపిస్తుంది. వ్యాయామంలో చెమట రూపంలో మలినాలన్నీ బయటికి పోవడంవల్ల కూడా చర్మం బాగుంటుంది. శరీరం మొత్తానికి పోషకాలు, ఆక్సిజన్ తీసుకెళ్లేది నీళ్లే. ముఖ్యంగా, మొటిమలు రాకుండా నీళ్లు అడ్డుకుంటాయి.
అందానికి చిట్కాలు :
- యాపిల్‌లోని పెక్టిన్ అనే పదార్థం మొటిమలతో పోరాడుతుంది.
- పెరుగులోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తాయి.
- నిమ్మరసం శరీరంలోని మలినాలను బయటికి పంపి, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
- పుచ్చకాయలోని విటమిన్-ఎ,బి,సి చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా చేస్తాయి. ముఖంపై మొటిమలు, మచ్చలను దూరం చేస్తాయి.
- అవకాడోలోని విటమిన్-ఇ చర్మాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది. మాయిశ్చరైజ్ చేస్తుంది.
మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్
Mayuri@trudiet.in
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Food
- healthy skin
- strawberry
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

