‘ప్రపంచంలో 7వేల అరుదైన వ్యాధులు.. చికిత్స అందుబాటులో 5 శాతమే’..
‘ప్రపంచంలో 7వేల అరుదైన వ్యాధులు.. చికిత్స అందుబాటులో 5 శాతమే’.. | ప్రపంచంలో ఏడువేల అరుదైన వ్యాధులు ఉన్నాయి. కానీ, అన్నింటికీ చికిత్స అందుబాటులో లేదు. ప్రస్తుతం వీటిలో ఐదుశాతం వాటికి మాత్రమే చికిత్స అందుబాటులో ఉందని

న్యూఢిల్లీ : ప్రపంచంలో ఏడువేల అరుదైన వ్యాధులు ఉన్నాయి. కానీ, అన్నింటికీ చికిత్స అందుబాటులో లేదు. ప్రస్తుతం వీటిలో ఐదుశాతం వాటికి మాత్రమే చికిత్స అందుబాటులో ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. కరోనా మాదిరిగానే అరుదైన వ్యాధుల జన్యుశ్రేణి గుర్తింపు ప్రక్రియ కూడా జరుగుతుందని తెలిపారు. అరుదైన వ్యాధులపై పోరాటానికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. క్రౌడ్ ఫండింగ్, టీబీ ఫ్రీ వర్క్ప్లేసెస్పై జరిగిన వెబ్‌నార్‌లో ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా 8శాతం మంది వివిధ రకాల అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని కేంద్రమంత్రి తెలిపారు.
అలాంటి రోగులకు సహాయం చేసేందుకు అన్ని కార్పొరేట్ గ్రూప్‌ల నుంచి ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ అరుదైన వ్యాధుల విధానాన్ని ప్రస్తావిస్తూ .. క్రౌడ్ ఫండింగ్ కోసం జాతీయ డిజిటల్ పోర్టల్ రూపొందించినట్లు చెప్పారు. అరుదైన వ్యాధుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని, కరోనా కాలంలో నేషనల్ రేర్ డిసీజ్ పాలసీని రూపొందించినట్లు చెప్పారు. మశూచి, పోలియోను నిర్మూలించినట్లే అరుదైన వ్యాధులపై యుద్ధం చేయాల్సి ఉందన్నారు.
దేశంలో ఎనిమిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు (సీఓఈ) కేంద్రాలను, మరో ఐదు డయాగ్నొస్టిక్ కేంద్రాలు సైతం చేశారన్నారు. బయోటెక్నాలజీ విభాగం న్యూ ఢిల్లీలోని లేడి హార్డింగ్ మెడికల్ కాలేజీలో మొదటి రోగ నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, ఇప్పుడు జిల్లాల్లో మరిన్ని రోగ నిర్ధారణ కేంద్రాలు నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు. భారత్‌లో టీబీ కేసుల్లో 33శాతం, మరణాల సంఖ్య 37శాతం తగ్గిందన్నారు. కొవిడ్ కాలంలోనూ టీబీ నివారణపై దృష్టి సారించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కిడ్నీ క్యాన్సర్ లక్షణాలివే..
Food safety tips : ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
మూడు రాష్ట్రాల్లో భూకంపాలు
నేడు 7.05లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ‘రైతు బంధు’
ఢిల్లీ ఎయిమ్స్‌లో అందుబాటులోకి ఓపీడీ సేవలు
డెల్టా వేరియంట్‌కు స్పుత్నిక్-వీ బూస్టర్ డోస్
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
2024 నాటికి రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 50శాతం తగ్గించడమే లక్ష్యం : కేంద్రమంత్రి
ట్విట్టర్ ఇండియా ఎండీకి యూపీ పోలీసుల నోటీస్
దేశంలో కొత్తగా 62,480 కరోనా కేసులు
రేపు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
పట్టాలెక్కనున్న శతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

