సూర్యాపేట టౌన్, నవంబర్ 03 : దొరికిన నగదును ఓ పోలీస్ బాధితుడికి అందజేసి నిజాయితీని చాటుకున్నాడు. సోమవారం సూర్యాపేట పట్టణంలో ఓ బంగారం షాపు ఓపెనింగ్ సందర్భంగా ప్రజలు ఎక్కువగా వస్తారనే ఉద్దేశ్యంతో స్పెషల్ పార్టీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అక్కడకి వచ్చిన ఓ వ్యక్తి తన వద్ద ఉన్న రూ.1.50 లక్షల నగదును పోగొట్టుకున్నాడు. ఆ నగదు అక్కడే విధుల్లో ఉన్న సూర్యాపేట జిల్లా స్పెషల్ పార్టీ ఆర్ముడ్ హెడ్ కానిస్టేబుల్ లింగయ్యకు దొరికినవి. దొరికిన నగదును సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది సాయంతో బాధితుడికి అందజేశాడు. బాధితుడు మోతే మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించి అందజేశారు. నిజాయితీ చూపిన హెడ్ కానిస్టేబుల్ లింగయ్యకు పోలీస్ అధికారులు, పలువురు వ్యక్తులు అభినందనలు తెలిపారు.