Bengaluru | దేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీగా పేరొందిన బెంగళూరు (Bengaluru)లో ఇళ్ల అద్దెలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. జీతంలో అత్యధిక భాగం ఇంటి అద్దెకే వెచ్చించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంపై నెట్టింట నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియా వెబ్ సైట్ ‘రెడిట్’లో (Reddit) ఓ నెటిజన్ పెట్టిన పోస్టు టెకీల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వివరాలు చూసి నెటిజన్లు సైతం నివ్వెరపోతున్నారు.
బెంగళూరులోని ఫ్రేజర్ టౌన్ ప్రాంతం (Frazer Town area)లో 2BHK ఫ్లాట్ (2BHK Flat) కోసం రూ.30 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ (security deposit) డిమాండ్ చేసినట్లు సదరు యూజర్ తెలిపారు. అది కొత్త ఇల్లని చెప్పారు. డిజైనర్ ఇంటీరియర్స్, ప్రీమియం బెడ్లు, మాడ్యులర్ కిచెన్, పవర్ బ్యాకప్, సెక్యూరిటీ, కార్ పార్కింగ్తో కూడిన స్టైలిష్, ఫర్నిష్డ్ ఈ 2BHK ఫ్లాట్ అద్దె నెలకు రూ.20 వేలుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. కొందరు ఇదో పెద్ద స్కామ్ అని అభిప్రాయపడగా.. మరికొందరు ఈ డబ్బుతో సొంత ఇంటిని కొనుక్కోవచ్చు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read..
Air Pollution | ఢిల్లీలో కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత.. అయినా పూర్ కేటగిరీలోనే వాయు కాలుష్యం