Chicken Fry | పెళ్లి వేడుకలో చిచ్చుపెట్టిన చికెన్ ఫ్రై.. ఇరుకుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ.. పోలీసుల రంగ ప్రవేశం
Chicken Fry | ఓ వివాహ (UP wedding) వేడుకలో చికెన్ ఫ్రై (Chicken Fry) చిచ్చుపెట్టింది. రుచికరమైన పదార్థాన్ని తగినంతగా వడ్డించలేదంటూ వధువు తరఫున బంధువులు ఫిర్యాదు చేశారు.
Chicken Fry | ఓ వివాహ (UP wedding) వేడుకలో చికెన్ ఫ్రై (Chicken Fry) చిచ్చుపెట్టింది. రుచికరమైన పదార్థాన్ని తగినంతగా వడ్డించలేదంటూ వరుడి తరఫున బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఇది కాస్తా చివరికి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బిజ్నోర్ (Bijnor) జిల్లాలో చోటు చేసుకుంది.
నిఖా సమయంలో వధువు తరఫువారు బంధువులకు రుచికరమైన వంటకాలను వడ్డించారు. అయితే, వరుడి బంధువులు మాత్రం తమకు చికెన్ ఫ్రై తక్కువగా వడ్డిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో వారిని శాంతింపజేసేందుకు వధువు కుటుంబం వారికి ఎక్కువ చికెన్ ఫ్రై ముక్కలు తెచ్చి వడ్డించింది. అయితే, వారు మర్యాదగా వడ్డించడంలేదంటూ మరో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ కాస్త గందరగోళం నెలకొంది. వధువు, వరుడి కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో దాదాపు 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపుచేశారు. ఇరు కుటుంబాలను శాంతింపజేసి.. కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరిపించారు. మరోవైపు ఘర్షణలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read..
Air Pollution | ఢిల్లీలో కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత.. అయినా పూర్ కేటగిరీలోనే వాయు కాలుష్యం
Chevella Accident | చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

