హైదరాబాద్ : లారీని బైక్ ఢీకొట్టడంతో హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. హోంగార్డు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్ వద్ద ప్రమాదం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పిట్లం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రాజ్‌కుమార్ హోంగార్డు మధుతో కలిసి బైక్‌పై మద్నూర్ నుంచి పిట్లం వెళ్తుండగా ఎన్‌హెచ్-161 వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారు.
ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా హోంగార్డు మధు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.