కొండాపూర్, ఏప్రిల్ 17 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేసేందుకు సిద్ధమైన తరుణంలో.. తమ భూములు తమకేనంటూ పోరాటం చేసిన ఏబీవీపీ విద్యార్థి నాయకుడు రోహిత్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో 16రోజుల జైలు శిక్ష అనంతరం రోహిత్ గురువారం విడుదలయ్యారు. సంగారెడ్డి జైలు నుంచి విడుదలైన రోహిత్‌కు తోటి విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని, భూముల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. వర్సిటీ భూముల్లో చెట్లను నరకకుండా, భూములను లాక్కోకుండా ఎంతవరకైనా పోరాడుతామని తేల్చిచెప్పారు.