న్యూఢిల్లీ: వాయు కాలుష్యంతో శ్వాస తీసుకోవడానికి సైతం ఇబ్బంది పడుతున్న ఢిల్లీ (Delhi) ప్రజలకు మరో సమస్య ముంచుకొచ్చింది. ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో (Ethiopia) బద్దలైన ఓ అగ్నిపర్వత (Volcano Eruption) ధూళి (Plume) ఢిల్లీ మీదుగా కదులుతున్నది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో అవి దేశ రాజధానికి చేరుకున్నాయని ఇండియా మెట్స్కై వెదర్ వెల్లడించింది. ఇథియోపియాలోని ఎర్టా అలే రేంజ్లో ఉన్న హైలీ గుబ్బి అగ్నిపర్వతం (Hayli Gubbi Volcano) సుమారు 10 వేల ఏండ్ల తర్వాత ఆదివారం పేలిన విషయం తెలిసిందే. దీని నుంచి పెద్ద ఎత్తున బూడిద, సల్ఫర్డయాక్సైడ్, ధూళితో కూడిన పొగ మబ్బులు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ఈ పొగ మబ్బులు 10-15 కి.మీ. మేరకు ఎగసిపడినట్లు టౌలౌస్ వొల్కానిక్ యాష్ అడ్వయిజరీ సెంటర్ శాటిలైట్ ద్వారా అంచనా వేసింది. ఎర్ర సముద్రంపై నుంచి తూర్పు దిశగా వ్యాపిస్తున్న పొగ మబ్బులు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో భారత్ వైపు ప్రయాణించాయి. జోధ్పూర్-జైసల్మేర్ రీజియన్ మీదుగా దేశంలోకి ప్రవేశించాయని ఇండియా మెట్ స్కై వెదర్ పేర్కొంది. అయితే ఆ బూడిద 25 వేల నుంచి 45 వేల ఫీట్ల ఎత్తులో పయణిస్తున్నదని, అంతగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదని స్పష్టం చేసింది.

పొగ మబ్బసులు కమ్ముకొస్తున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అప్రమత్తం చేసింది. ఢిల్లీ, జైపూర్తోపాటు ఉత్తర భారత మీదుగా ప్రయాణించే పలు విమానాల మార్గాలను మార్చింది. కాగా, ఇథియోపియాలోని అఫర్ రీజియన్లో ఉన్న హైలీ గబ్బి అగ్నిపర్వతం గత 10 వేల ఏండ్లలో పేలినట్లు రికార్డులు లేవు. తాజా విస్ఫోటాన్ని స్థానిక చరిత్రలో అత్యంత అసాధారణమైన ఘటనల్లో ఒకటిగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
🇪🇹🌋 Hayli Gubbi volcano erupts for the first time in 10,000 years
The eruption sent a massive ash plume rising 10-15 kilometers into the sky.
📍 Northeastern Ethiopia pic.twitter.com/gHaDkA6XKz
— Sputnik Africa (@sputnik_africa) November 24, 2025
Update06:
The Ash plume mostly consists of Sulphur Dioxide with low to moderate concentrations of Volcanic Ash. Its now stretching from Oman-Arabian sea region into Plains of North & Central India. Its will not impact AQI levels but it will impact So2 level at #Hills of #Nepal,… https://t.co/f95r95mLMi pic.twitter.com/WQOOhKmyHM— IndiaMetSky Weather (@indiametsky) November 24, 2025