అయోధ్య :అయోధ్య రామాలయంలో ఇవాళ ధ్వజారోహణం(Ayodhya Dhwajarohan) జరగనున్నది. ఆలయ శిఖరంపై జెండాను ఎగరవేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ అక్కడ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అనేక మంది పీఠాధిపతులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. తోటాద్రి మఠ జగద్గురు స్వామి అనంతాచార్య మాట్లాడుతూ జెండా అనేది ఆలయాన్ని సూచిస్తుందన్నారు. ఇది మతపరమైన ప్రాంతమన్న సంకేతాన్ని ఇస్తుందన్నారు. చాలా దూరం నుంచే జెండాలు ఆ సంకేతాన్ని ఇస్తాయన్నారు. తల ఎత్తుకుని జెండాను చూడాలని, అందుకే ఆలయాల్లో శుభగడియల్లో జెండాను ఆవిష్కరిస్తారన్నారు. సంపూర్ణం అనేది విశ్వ సిద్ధాంతం అని, మంచి పనులు పూర్తి అవుతాయని, ఇది ఉత్తమమైన సందర్భమని, ప్రతి ఒక్కరికీ మంచి తరుణమని, దేశ ప్రజల మంచి కోసమే జరుగుతున్నదని, ఆ లక్ష్యంతోనే ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
#WATCH | Ayodhya Dhwajarohan | Totadri Math Jagadguru Swami Anantacharya says, “It is exemplary for the world. The flag gives the information that this is a temple, it is a religious place, it gives the information from a distance. The flag holds the head high above all else,… pic.twitter.com/85xwzFAFYo
— ANI (@ANI) November 25, 2025
అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయ పూజారి మహంత్ రాజు దాస్ మాట్లాడుతూ.. సంకట్ కటే మిటే సబ్ పీడా జో సుమిరై హనుమత్ బలబీరా అన్నారు. శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేసిన తర్వాత.. యావత్ ప్రపంచం సనాతన సంస్కృతితో నిండిపోతుందన్నారు. సనాతనం అనేద ధర్మం విజయాన్ని నేర్పుతుందని, అధర్మాన్ని అంతం చేస్తుందన్నారు. ప్రజల మద్య సోదరభావాన్ని పెంచుతుందన్నారు. ప్రపంచ సంక్షేమం కాంక్షిస్తుందన్నారు. సర్వ భవతు సుఖినహ్, సర్వసంతు నిరామయ అనే భావాన్ని ధర్మ సనాతనం బోధిస్తుందన్నారు.రామ్ లల్లా టెంటులో ఉన్న సమయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రత్యామ్నాయ ఆలయంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు ప్రధాని మోదీ చాలా వైభవోపేతంగా రామాలయాన్ని నిర్మించారని, ఆ నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో జెండాను ఆవిష్కరిస్తున్నారని, దీని పట్ల సంతోషంగా ఉందని మహంత్ రాజు దాస్ తెలిపారు.
#WATCH | Ayodhya Dhwajarohan | Hanuman Garhi temple priest Mahant Raju Das says, “… ‘Sankat katey Mitey sab Peeda, Jo Sumire Hanumant Balbira”… When the saffron flag will be hoisted on the Shikhar today under the leadership of the Prime Minister, CM of Uttar Pradesh Yogi… pic.twitter.com/8vyM4hOFSE
— ANI (@ANI) November 25, 2025