డర్బన్: దక్షిణాఫ్రికాతో తొలి టీ20 పోరులో భారత మహిళల జట్టు ఆకట్టుకుంది. టీ20 ప్రపంచకప్ సన్నాహాలోల భాగంగా శుక్రవారం జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 157/7 స్కోరు చేసింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ (47 నాటౌట్), రోడ్రిగ్స్ (36) రాణించారు. ఓపెనర్లు షెఫాలీవర్మ (34), మందన (13) మెరుగైన శుభారంభం అందించారు. ఖాక (3/16), తుమి సెకునె(2/27) ఆకట్టుకున్నారు.