పౌరాణిక పాత్రల్లో నటించేందుకు నేటి తారలంతా ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ రాముడిగా, కర్ణుడిగా ఆకట్టుకోగా, ‘కల్కి 2898ఏడీ’లో హీరో దేవరకొండ విజయ్ అర్జునుడిగా తళుక్కున మెరిశారు. ఇక అదే సినిమాలో బిగ్‌బీ అమితాబ్ అశ్వత్థామగా విశ్వరూపమే చూపించారు. హిందీలో రణబీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తూ ‘రామాయణ’ ఫ్రాంచైజీ చేస్తుంటే, అదే సినిమాలో కన్నడ స్టార్ హీరో యష్ రావణుడిగా, సన్నీడియోల్ ఆంజనేయుడిగా కనిపించబోతున్నారు.
ఇప్పటికే ‘జై హనుమాన్’లో ‘కాంతారా’ఫేం రిషబ్‌శెట్టి హనుమంతుడిగా నటిస్తున్న విషయం విదితమే. త్వరలో ఎన్టీఆర్ షణ్ముఖుడిగా పూర్తిస్థాయి పౌరాణిక చిత్రం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మన భల్లాలదేవుడు రానా కూడా ‘జై హనుమాన్’లో రావణుడిగా నటిస్తున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో వార్తలొస్తున్నాయి. దాంతో ‘జై హనుమాన్’పై జనాల్లో ఆసక్తి రెట్టింపయ్యింది. మరి ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.