పెద్దపల్లి : పండుగ పూట రైతులకు కాంగ్రెస్ పార్టీ యూరియా కష్టాలు తెచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వాళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పెద్దపల్లి జిల్లా రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అనాలోచిత చర్య మూలంగా పండుగ పూట రైతులు అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు.
మంగళవారం పాలకుర్తి మండలం ఈసాల తక్కల్లపల్లి గ్రామంలో యూరియా కోసం క్యూలైన్లో నిలుచున్న రైతులతో మాట్లాడారు. రైతులను ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే అస్సలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇవాల్టికి రామగుండం ఎరువుల కర్మాగారం షట్ డౌన్ అయ్యి నెల పైనే అయింది. ఇప్పటికి దాని మరమ్మతులు చేసి ప్రారంభించలేదన్నారు.