హైదరాబాద్, మార్చి 28(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సాక్షిగా రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ బండారాన్ని బయటపెట్టిన బీఆర్ఎస్పై అధికార కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు దిగుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీలో అడ్డంగా దొరికిపోయి తప్పించుకోలేక ఎదురుదాడికి దిగడం దుర్మార్గమని నిప్పులుచెరిగారు. శనివారం అసెంబ్లీ మీడియా హాల్లో ఎమ్మెల్యేలు వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, మాణిక్‌రావు, డాక్టర్ సంజ య్, విజయుడుతో కలిసి విలేకరులతో మా ట్లాడారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడు తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సొంత ఆస్తులు పెంచుకొనేందుకు యత్నిస్తున్న మంత్రి అవినీతి పర్వాన్ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ఆధారాలతో బట్టబయలు చేశారని గుర్తుచేశారు.
స్పందించాల్సిన మంత్రి మిన్నకుండి పోతే, సభలోని ఎనిమిది మంది మంత్రులు పొంతనలేకుం డా మాట్లాడడం ఆక్షేపణీయమని మండిపడ్డారు. మైనింగ్ శాఖ మంత్రి ఆలస్యంగా తేరుకొని రూ.4లక్షలకే సభా సంఘం అడుగుతా రా? సిట్టింగ్ జడ్జితో విచారణ వేయమంట రా? అని మాట్లాడిన తీరును చూసి ప్రజలు నివ్వెరపోయారని చెప్పారు. మంత్రి చెప్పినట్టు అది 4లక్షల వ్యవహారం కాదని, అసలు రాఘవ కన్స్ట్రక్షన్స్కే అనుమతుల్లేవని, అందు కే అధికారులు గుర్తించి నోటీసులు ఇచ్చారని తెలిపారు. కానీ ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడంలో ఉద్దేశపూర్వకంగానే తాత్సా రం చేసిందని ఆరోపించారు.
పట్టుకున్న వారిపై విచారణా?
చట్టసభల సాక్షిగా పట్టుబడ్డ దొంగలను శిక్షించాల్సిన సీఎం రేవంత్.. పట్టుకున్న వారిపై విచారణ చేయిస్తామని చెప్పడం సిగ్గుచేటని జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘గతంలో రూ.50లక్షలతో రేవంత్ పట్టుబడితే.. ప్రస్తు తం వారి మంత్రి పక్కా ఆధారాలతో దొరికిపోయాడు.. ఇక తప్పించుకొనే అవకాశం లేదని తెలిసి ఎదురుదాడికి దిగాడు. ఎవరో అన్నదమ్ములో.. దూరపు బంధువులో అయి తే మంత్రికేం సంబంధమని వితండవాదన చేశాడు’ అంటూ విమర్శలు గుప్పించారు.
విచారణలకు బీఆర్ఎస్ భయపడదు
మంత్రి అవినీతిని కప్పిపుచ్చేందుకే పదేండ్ల కిందటి వ్యవహారాలను సీఎం ముం దుకు తెచ్చి విచారణ పేరుతో బెదిరించడం శోచనీయమని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలపై విచారణ జరిపించి తేల్చిందేమిటో ప్రజల ముందుపెట్టాలని డిమాండ్ చేశారు. ‘గతంలో హరీశ్‌రావు అడిగినందునే కాళేశ్వరంపై, కేటీఆర్ అడిగినందుకే ట్యాపింగ్‌పై విచారణ జరిపిస్తున్నామని పోజులు కొట్టి న రేవంత్.. మరీ ఇప్పుడు ‘రాఘవ’ అవినీతిపై బీఆర్ఎస్ సభాసంఘం వేయాలని అడిగితే, సీబీసీ ఐడీ అంటున్నరు.. మీ బెదిరింపులకు, ఉడుత ఊపులకు బీఆర్ఎస్ భయపడబోదు’ అని కుండబద్దలు కొట్టారు.
మైనింగ్ ఆదాయం పెంచింది కేసీఆరే..
రాష్ట్రం రాకముందు రూ.39 కోట్లు ఉన్న మైనింగ్ ఆదాయాన్ని రూ.5వేల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని జగదీశ్‌రెడ్డి తెలిపారు. కానీ అక్రమాలకు తెరలేపిన అధికార పార్టీ 30శాతం ఆదాయం పెంచామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
‘నేరెళ్ల’ తర్వాత కేటీఆర్ 2సార్లు గెలిచారు
అవినీతి ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ పెద్ద.. బీఆర్ఎస్పై బురదజల్లుతూ పబ్బం గడుపుతున్నారని జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. అడ్డంగా దొరికిన ప్రతిసారీ నేరెళ్ల ఘటనను తెరపైకి తెస్తారని విమర్శించారు. ఈ ఘటన తర్వాత కేటీఆర్ రెండుసార్లు గెలిచారని, ఆ గ్రామంలోనూ 500ఓట్లకు పైగా మెజారిటీ వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.