చండీఘడ్: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇటీవల రాజ్యసభ ఎంపీగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఇవాళ టర్బనేటర్ హర్భజన్ ఓ కీలక ప్రకటన చేశారు. రాజ్యసభ సభ్యులకు వచ్చే జీతాన్ని రైతుల కుమార్తెల చదువు, సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు భజ్జీ తన ట్విట్టర్లో తెలిపారు. ఈ దేశాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. దేశం కోసం ఏదైనా చేస్తానని తన ట్వీట్లో హర్భజన్ తెలిపారు. ఇటీవల పంజాబ్ నుంచి రాజ్యసభకు అయిదుగురు సభ్యులు ఎన్నికయ్యారు. అయితే క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు భజ్జీ చెప్పిన విషయం తెలిసిందే.
As a Rajya Sabha member, I want to contribute my RS salary to the daughters of farmers for their education & welfare. I've joined to contribute to the betterment of our nation and will do everything I can. Jai Hind 🇮🇳🇮🇳
— Harbhajan Turbanator (@harbhajan_singh) April 16, 2022