30 లక్షల మందికి చీరలు ఇవ్వలేకపోయాం : సీతక్క
రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు లివ్వలేకపోయామని, పట్టణ ప్రాంతాల్లో చీరలు పంపిణీ చేయలేకపోయామని మంత్రి సీతక్క అసెంబ్లీలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 60 లక్షల మందికి మాత్రమే చీరలు పంపిణీ చేసినట్టు తెలిపారు.
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు లివ్వలేకపోయామని, పట్టణ ప్రాంతాల్లో చీరలు పంపిణీ చేయలేకపోయామని మంత్రి సీతక్క అసెంబ్లీలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 60 లక్షల మందికి మాత్రమే చీరలు పంపిణీ చేసినట్టు తెలిపారు. సోమవారం శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు బాలూనాయక్, పాయల్‌శంకర్, గండ్ర సత్యనారాయణరావు, వీర్లపల్లి శంకరయ్య, పాల్వాయి హరీశ్‌బాబు పలు ప్రశ్నలడిగారు. డీఆర్డీవోలో అవినీతిపరులను కాపాడొద్దని పాల్వాయి హరీశ్‌బాబు కోరగా, నియోజకవర్గ స్థాయిలో మున్సిపాలిటీలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటుచేయాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్‌చేశారు.
ఉద్యోగుల వయోపరిమితి పెంచడం లేదు : శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 61 ఏండ్ల నుంచి 64 ఏండ్లకు పెంచడం లేదని మంత్రి శ్రీధర్‌బాబు శాసనసభలో స్పష్టంచేశారు. సోమవా రం జీరో అవర్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఉద్యోగుల వయోపరిమితి గురించి పలువురు తమను ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. బయట ఏదో ప్రచారం జరిగితే ఆ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం ఏంటి? అని ప్రశ్నించారు. ఔటర్ రింగురోడ్డు, రీజినల్ రింగురోడ్డులో కాంగ్రెస్ నాయకుల భూములు ఉన్నాయనే అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రాకేశ్‌రెడ్డి ఆరోపించగా, 20 ఏండ్ల కింద కొన్న వారికి భూములు ఉండొచ్చని శ్రీధర్‌బాబు దాటవేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వానని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

